Loading...
Selma Blair: విమానంలో హాలీవుడ్‌ నటి రచ్చ.. ఫ్లైట్‌ అటెండెంట్‌ను కొరికి, సిబ్బందిపై దాడి!
విమానంలో హాలీవుడ్‌ నటి రచ్చ.. ఫ్లైట్‌ అటెండెంట్‌ను కొరికి, సిబ్బందిపై దాడి!

Selma Blair: విమానంలో హాలీవుడ్‌ నటి రచ్చ.. ఫ్లైట్‌ అటెండెంట్‌ను కొరికి, సిబ్బందిపై దాడి!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 13, 2026
09:57 am

ఈ వార్తాకథనం ఏంటి

హాలీవుడ్‌ నటి సెల్మా బ్లెయిర్‌ (Selma Blair) విమాన ప్రయాణంలో ప్రవర్తించిన తీరు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. లాస్‌ ఏంజెలెస్‌ నుంచి న్యూయార్క్‌కు వెళ్తున్న డెల్టా ఎయిర్‌లైన్స్‌ విమానంలో ఆమె హంగామా చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. విమాన సిబ్బందిపై దాడి చేయడంతో పాటు వారిని కొరికినట్లు ఆరోపణలు నమోదయ్యాయి. విమానం దిగిన తర్వాత కూడా ఆమె ప్రవర్తన ఆగలేదని, ఓ పోలీసు అధికారి, ఆసుపత్రి నర్సుపైనా దాడికి పాల్పడినట్లు కేసు నమోదైంది. ఈ ఘటనలో ఇద్దరు విమాన సిబ్బంది గాయపడినట్లు సమాచారం. మరోవైపు సెల్మా బ్లెయిర్‌ తరఫు న్యాయవాది కోర్టులో ఆమె ప్రవర్తనకు సంబంధించిన వివరణ ఇచ్చారు.

వివరాలు

మానసిక పరిస్థితి సరిగ్గా లేనట్లు సమచారం

సంబంధిత సమస్యలకు తీసుకోవాల్సిన మందులు వాడకపోవడం, విమానంలో తలకు గాయం కావడం వల్ల ఆమె అయోమయానికి గురయ్యారని తెలిపారు.

ఆ సమయంలో ఆమె మానసిక పరిస్థితి సరిగ్గా లేదని వివరించారు. అంతేకాకుండా, విరామం లేకుండా ఎక్కువ గంటలు పనిచేయడం, తీవ్ర అలసట, విమానంలో తలకు తగిలిన గాయం వంటి అంశాలు ఆమె పరిస్థితిపై ప్రభావం చూపి ఉండవచ్చని పేర్కొన్నారు.

ఈ ఘటనను ఉద్దేశపూర్వకంగా చేసినది కాదని న్యాయవాది వాదించారు. ఈ కేసులో తదుపరి విచారణ జనవరి 19న జరగనుంది.

సెల్మా బ్లెయిర్‌ 'క్రూయల్‌ ఇంటెన్షన్స్‌', 'లీగల్లీ బ్లాండ్‌', 'హెల్‌బాయ్‌' వంటి ప్రముఖ చిత్రాలతో హాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే, విమానంలో జరిగిన ఈ ఘటనతో ఆమె మరోసారి వార్తల్లో నిలిచారు.

వివరాలు

గతంలోనూ సెలబ్రిటీలను కొరికినట్లు వెల్లడించిన నటి

సెల్మా బ్లెయిర్‌ గతంలోనూ పలువురు ప్రముఖులను కొరికినట్లు స్వయంగా తన పుస్తకంలో వెల్లడించారు.

బహిరంగ ప్రదేశాల్లో తీవ్ర ఒత్తిడికి గురైనప్పుడు తాను అలా ప్రవర్తిస్తానని అందులో పేర్కొన్నారు. 2006లో నటి సియన్నా మిల్లర్‌ను తొలిసారి కలిసిన సమయంలో ఆమె చేతిని కొరికినట్లు సెల్మా తెలిపారు.

అయితే సియన్నా మిల్లర్‌ ఈ ఘటనపై పెద్దగా కోపం వ్యక్తం చేయలేదని వెల్లడించారు. అలాగే లండన్‌లోని ఓ హోటల్‌లో సూపర్‌ మోడల్‌ కేట్‌ మోస్‌ వేలిని కూడా కొరికినట్లు ఆమె తన పుస్తకంలో రాశారు.

దీనికి ప్రతిస్పందనగా కేట్‌ మోస్‌ తిరిగి పంచ్‌ ఇవ్వడంతో పాటు సెల్మా బొటనవేలిని గట్టిగా కొరికినట్లు వివరించారు.

ADVERTISEMENT

వివరాలు

హాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశం

ఈ ఘటన తర్వాత ఎదుటివారికి తాను ఎంతటి ఇబ్బంది, బాధ కలిగిస్తున్నానో అర్థమైందని సెల్మా బ్లెయిర్‌ పేర్కొన్నారు.

విమాన ప్రయాణంలో తాజాగా చోటుచేసుకున్న ఘటన, గతంలో ప్రముఖులతో జరిగిన ఇలాంటి సంఘటనల వివరాలు వెలుగులోకి రావడంతో హాలీవుడ్‌ వర్గాల్లో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.

ADVERTISEMENT