NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / మోడలింగ్ పేరుతో మోసం చేసి 15లక్షలు కాజేసిన బాలీవుడ్ భార్యాభర్తలు
    తదుపరి వార్తా కథనం
    మోడలింగ్ పేరుతో మోసం చేసి 15లక్షలు కాజేసిన బాలీవుడ్ భార్యాభర్తలు

    మోడలింగ్ పేరుతో మోసం చేసి 15లక్షలు కాజేసిన బాలీవుడ్ భార్యాభర్తలు

    వ్రాసిన వారు Sriram Pranateja
    Jan 24, 2023
    12:04 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించిన అపూర్వా అశ్విన్ అలియాస్ అర్మాన్ అర్జున్ కపూర్, ఇంకా అతని భార్య నటాషా కపూర్ అలియాస్ నజీష్ మీమన్ హైదరాబాద్ లో అరెస్ట్ అయ్యారు.

    మోడలింగ్ లో అవకాశాలు ఇప్పిస్తామని, బడా వ్యాపారవేత్తల నుండి డబ్బులు లాగేసుకుని మోసం చేసినందుకు సైబరాబాద్ పోలీసులు, వీళ్ళిద్దరిని సోమవారం అరెస్ట్ చేసారు.

    సైబరాబాద్ డీఎస్పీ కల్మేశ్వర్ సింగేశ్వర్ చెప్పిన వివరాల ప్రకారం, బిస్కట్ కంపెనీ యాడ్ షూటింగ్ లో అవకాశం ఇప్పిస్తామంటూ నిందితుల నుండి 14.12లక్షలు వసూలు చేసారట.

    ఆ తర్వాత యాడ్ గురించి ఎలాంటి సమాచారం అందివ్వకపోవడం, డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో తాను మోసపోయానని అర్థం చేసుకుని నిందితుడు పోలీసులను ఆశ్రయించాడని డీఎస్పీ చెప్పుకొచ్చారు.

    బాలీవుడ్

    షాపింగ్ మాల్ వేదికగా ఎర వేసిన బాలీవుడ్ యాక్టర్స్

    మహారాష్ట్రకి చెందిన అపూర్వా అశ్విన్, నటాషా కపూర్.. హైదరాబాద్ లో పాగా వేసి పలు మోసాలకు పాల్పడుతున్నారు.

    హైదరాబాద్ లోని షాపింగ్ మాల్స్ వేదికగా ర్యాంప్ షోలు నిర్వహిస్తున్న ఈ మోసగాళ్ళు, మాల్ కి వచ్చిన వారిలోంచి కొందరిని సెలెక్ట్ చేసి, ప్రముఖ బిజినెస్ కంపెనీల ప్రమోషన్లకు మోడల్ గా సెలెక్ట్ అయినట్లు చెబుతున్నారు.

    ప్రస్తుత కేసులో నిందితుడికి అలానే జరిగిందని, ర్యాంప్ షోలో ఒకమ్మాయిని సెలెక్ట్ చేసి, వాళ్ల తండ్రి నుండి ముందుగా 3.25లక్షలు అడిగారట. ఆ తర్వాత 10.87లక్షలు ఇవ్వమన్నారట.

    ఈ మోసగాళ్ళిద్దరినీ అరెస్ట్ చేసిన పోలీసులు, వారి నుండి 15.60లక్షల క్యాష్, నాలుగు మొబైల్ ఫోన్లు, ఒక ల్యాప్ టాప్ స్వాధీనం చేసుకున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సినిమా

    తాజా

    Test Retirement: టెస్ట్ క్రికెట్ అభిమానులకు మరో పెద్ద షాక్.. రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్..?!  శ్రీలంక
    World Bank, FATF: పాక్‌ ఆర్థిక మూలాలపై భారత్ దెబ్బ.. ప్రపంచ బ్యాంకుకి ఫిర్యాదు చేసే ఆలోచనలో ఇండియా  పాకిస్థాన్
    Ajit Doval: ఎస్‌-400 క్షిపణి వ్యవస్థ ముందస్తు డెలివరీల కోసం రష్యాకు వెళ్లనున్న అజిత్‌ దోవల్  అజిత్ దోవల్‌
    Stock market: లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్ సూచీలు.. 24,800 ఎగువకు నిఫ్టీ స్టాక్ మార్కెట్

    సినిమా

    సినిమా: ఈ సంవత్సరం గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్ అందుకున్న విజేతలు వీళ్ళే సినిమా
    అలవైకుంఠపురములో బాలీవుడ్ రీమేక్: రాజమౌళి రిఫరెన్స్ తో వచ్చిన షెహజాదా ట్రైలర్ సినిమా
    ధనుష్ తెలుగు సినిమా సార్ నుండి కొత్త పాట రిలీజ్ తెలుగు సినిమా
    బిచ్చగాడు సినిమా హీరోకు యాక్సిడెంట్, తీవ్రగాయాలు సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025