LOADING...
Rashmika: విజయ్‌ని ముద్దుగా ఆ పేరుతో పిలుస్తా : రష్మిక మంధాన
విజయ్‌ని ముద్దుగా ఆ పేరుతో పిలుస్తా : రష్మిక మంధాన

Rashmika: విజయ్‌ని ముద్దుగా ఆ పేరుతో పిలుస్తా : రష్మిక మంధాన

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 08, 2025
11:43 am

ఈ వార్తాకథనం ఏంటి

సినీ ప్రేమజంట రష్మిక మందన్న-విజయ్ దేవరకొండ నాలుగు రోజులుగా సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. కారణం వారి సినిమా సంగతులు కాదు, ఇద్దరికీ నిశ్చితార్థం అయ్యిందన్న వార్తలు. అధికారిక ధృవీకరణ ఇప్పటివరకు రాలేదు. అయినప్పటికీ, వారి సన్నిహితుల నుంచి సమాచారం వచ్చి, ఫ్యాన్స్ "మ్యాచ్ కన్‌ఫర్మ్‌!" అని ఉత్సాహంగా స్పందిస్తున్నారు. ఈ వార్తల నేపథ్యంలో జంట పెళ్లి ఎప్పుడా జరుగుతుందో అన్న ఆతృత కూడా నెలకొంది. రష్మిక-విజయ్ జంట కొన్నేళ్లుగా ఎక్కడ కనిపించినా, ఒకరి గురించి మరొకరు ఏమన్నా చెప్పిన ప్రతిసారి సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టించారు. 2018లో 'గీత గోవిందం'తో తొలిసారిగా కలిసి నటించిన వీరు, 2019లో 'డియర్ కామ్రేడ్'లో మళ్లీ కలిసి నటించారు.

Details

ఎంగేజ్ మెంట్ రింగ్ తో దర్శనమిచ్చిన విజయ్

ఈ క్రమంలో స్నేహం చిగురించి, ఈ జంట ప్రేమలో ఉందని ఊహించుకున్నారు. అయినా, నేరుగా ఎప్పుడూ ఈ విషయాన్ని వెల్లడించలేదు. ప్రస్తుతం ఇద్దరూ తమ సినిమాల బిజీ షెడ్యూల్‌లో ఉన్నారు. రష్మిక ఇటీవల 'ఛావా', 'కుబేర' వంటి హిట్లను అందుకుంది; త్వరలో 'థామా', 'ద గర్ల్‌ఫ్రెండ్' వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. విజయ్ ఈ ఏడాది 'కింగ్డమ్'తో హిట్ కొట్టి, 'డాన్ 3', 'రౌడీ జనార్దన్'తో బిజీగా ఉన్నాడు. ఎంగేజ్‌మెంట్ వార్తలు రావడంతో, ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు సమక్షంలో జంట ఉంగరాలు మార్చుకున్నట్లు ప్రచారం. అలాగే, విజయ్ ఇటీవల తన చేతికి ఉంగరం ధరించి ఉండటంతో ఈ వార్తలకు బలం చేకూరింది.

Details

ఫిబ్రవరిలో పెళ్లి..?

కొంతమంది వచ్చే ఫిబ్రవరిలో పెళ్లి జరుగుతుందని కూడా ప్రచారం చేస్తున్నారు. రష్మిక, గతంలో విజయ్ గురించి మాట్లాడుతూ మేమిద్దరం మధ్య తరగతి కుటుంబాల నుంచి వచ్చాం, ఆలోచన విధానం, దృష్టి కోణాలు దాదాపు ఒకేలా ఉన్నాయి. ఇది నాకు నచ్చుతుంది. విజయ్‌ని 'విజ్జు' అని పిలుస్తాను. ప్రతి విషయంలో అతను మంచి సలహా ఇస్తాడు. కానీ ఎక్కువగా పని గురించే ఆలోచిస్తాడు, ఫోన్‌లో ఎక్కువ సమయం గడుపుతామని చెప్పింది. గతేడాది రష్మిక-విజయ్ వేర్వేరు వెకేషన్ ఫొటోలు, ఒకే బ్యాక్‌డ్రాప్‌తోని పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.