Poorna: 'రజనీకాంత్‌తో నటిస్తానని కలలో కూడా అనుకోలేదు'.. పూర్ణ ఎమోషనల్ కామెంట్స్!
ఈ వార్తాకథనం ఏంటి
సూపర్‌స్టార్ రజనీకాంత్ (Rajinikanth) నటించిన 'జైలర్ 2' (Jailer 2) బాక్సాఫీస్ వద్ద భారీ విజయంతో దూసుకుపోతోంది. ఈ సినిమా సాధిస్తున్న విజయంపై నటి పూర్ణ (Poorna) హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో ఆమె చేసిన డ్యాన్స్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఇంతటి భారీ చిత్రంలో తనకు అవకాశం కల్పించిన దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్, నిర్మాత కళానిధి మారన్, సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్‌కు పూర్ణ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను పంచుకున్నారు.
వివరాలు
రజనీకాంత్‌తో నటించడం నా కల..
ఈ సందర్భంగా పూర్ణ భావోద్వేగానికి గురయ్యారు. ''రజనీకాంత్‌తో కలిసి స్క్రీన్ పంచుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. నాకు కూడా అలాంటి అవకాశం వస్తుందని కలలో కూడా ఊహించలేదు.
నేను ఎన్నో ఏళ్లుగా ఆయనకు వీరాభిమానిని. రజనీకాంత్ నటించిన 'పడయప్ప' (తెలుగులో 'నరసింహ') నాకు ఎంతో ఇష్టమైన సినిమా. 'జైలర్ 2' వంటి భారీ ప్రాజెక్టులో ఇంత మంచి పాటలో నటించే అవకాశం వస్తుందని అస్సలు అనుకోలేదు.
ఈ పాటకు ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన చూసి ఎంతో సంతోషంగా ఉంది. వారికి కృతజ్ఞతలు చెప్పేందుకు సినిమా విడుదల కోసం ఇన్ని రోజులు ఎదురుచూశాను.
మనం చేసే కష్టానికి, పని పట్ల చూపించే అంకితభావానికి ఎప్పటికైనా తగిన ఫలితం దక్కుతుందని అందరూ చెబుతుంటారు.
వివరాలు
'అల బోలెలో' పాటకు విశేష స్పందన
. ఇప్పుడు నాకు కూడా అలాంటి ఫలితమే దక్కిందని ఆమె పేర్కొన్నారు. 'జైలర్ 2' సినిమాలోని 'అల బోలెలో' అనే ప్రత్యేక పాటలో పూర్ణ నృత్యం చేసిన విషయం తెలిసిందే.
ఈ పాటలో ఆమె చేసిన డ్యాన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. భారీ చిత్రంలో భాగమవడంతో పాటు, తన ప్రదర్శనకు మంచి స్పందన లభించడంతో పూర్ణ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
వివరాలు
మూడు రోజుల్లోనే రూ.317.15 కోట్ల గ్రాస్ వసూళ్లు
మరోవైపు, 'జైలర్ 2' బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది.
శుక్రవారం ఈ చిత్రం రూ.37.10 కోట్ల వసూళ్లు సాధించగా.. శనివారం రూ.47.80 కోట్ల నెట్ కలెక్షన్లు రాబట్టింది.
దీంతో భారత్‌లో ఈ సినిమా నెట్ వసూళ్లు రూ.100 కోట్ల మార్కును దాటాయి. ప్రపంచవ్యాప్తంగా కేవలం మూడు రోజుల్లోనే రూ.317.15 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించి 'జైలర్ 2' రికార్డుల దిశగా దూసుకుపోతోంది.
సినిమాకు వస్తున్న ఆదరణతో చిత్ర బృందం ఆనందంలో ఉంది.