Loading...
Manchu Manoj: ఓ తండ్రిగా ఎంతో బాధపడ్డా.. రాప్తాడు ఘటనపై మంచు మనోజ్‌ ఆవేదన
ఓ తండ్రిగా ఎంతో బాధపడ్డా.. రాప్తాడు ఘటనపై మంచు మనోజ్‌ ఆవేదన

Manchu Manoj: ఓ తండ్రిగా ఎంతో బాధపడ్డా.. రాప్తాడు ఘటనపై మంచు మనోజ్‌ ఆవేదన

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 02, 2026
11:17 am

ఈ వార్తాకథనం ఏంటి

అనంతపురం జిల్లా రాప్తాడులో పదో తరగతి విద్యార్థినులపై జరిగిన దాడి ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని సినీ నటుడు మంచు మనోజ్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. ఓతండ్రిగా ఈ ఘటన తనను ఎంతో బాధించిందని పేర్కొన్నాడు. దాడిలో గాయపడిన బాధిత బాలికలు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపాడు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ద్వారా స్పందించాడు. ఈ ఘటనలో బాధితురాలిని రక్షించేందుకు ప్రయత్నించిన మరో బాలిక ధైర్యసాహసాలను మంచు మనోజ్‌ ప్రత్యేకంగా ప్రశంసించాడు. తన స్నేహితురాలిని కాపాడేందుకు ముందుకొచ్చిన ఆ చిన్నారి అసాధారణ సాహసం ప్రదర్శించిందని కొనియాడాడు. ఆమె ధైర్యానికి తగిన గుర్తింపు, గౌరవం ఇవ్వాలని అభిప్రాయపడ్డాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాలికలకు చికిత్స అందిస్తున్న వైద్యులకు కృతజ్ఞతలు తెలిపాడు.

వివరాలు

నిరంతర మానసిక సహకారం అందించాలి

మెరుగైన వైద్యం కోసం గ్రీన్‌ కారిడార్‌ ఏర్పాటు చేసి, తరలింపు ప్రక్రియను సమర్థంగా సమన్వయం చేసిన ఏపీ ప్రభుత్వం, పోలీసు, వైద్య బృందాలను అభినందించాడు.

ఈ దాడి ఘటనతో మానసికంగా ప్రభావితమైన విద్యార్థులకు సహాయం అందించేందుకు 20 మంది మానసిక ఆరోగ్య కౌన్సెలర్లను నియమించడం సంతోషకరమైన విషయమని మనోజ్‌ పేర్కొన్నాడు.

బాధిత విద్యార్థినులతో పాటు ఈ ఘటన ప్రభావం ఎదుర్కొంటున్న ఇతర విద్యార్థులు, ఉపాధ్యాయులు, వారి కుటుంబాలకు కూడా నిరంతర మానసిక సహకారం అందించాలని కోరాడు.

మహిళలను వస్తువులుగా చూడటం, సరదా పేరుతో వారిని కించపరచడం వంటి ధోరణులు సమాజంలో ప్రమాదకరమైన ఆలోచనలకు దారితీస్తాయని మంచు మనోజ్‌ అభిప్రాయపడ్డాడు.

వివరాలు

మహిళల పట్ల గౌరవంగా ఉండాలి

మహిళలపై వేధింపులకు, హింసకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశాడు.

మహిళల పట్ల గౌరవం ఇంటి నుంచే ప్రారంభం కావాలని, పిల్లలు పెద్దలను చూసే విలువలు, ప్రవర్తన నేర్చుకుంటారని గుర్తుచేశాడు.

ప్రతి ఒక్కరూ మహిళల పట్ల గౌరవంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించినప్పుడే వారికి సురక్షితమైన సమాజాన్ని నిర్మించగలమని మంచు మనోజ్‌ పిలుపునిచ్చాడు.

ADVERTISEMENT