Loading...
Idhupu Kayitham Movie: వెరైటీ ఇడుపుకాయితం...నవ్విస్తూనే ఏడిపిస్తుంది
వెరైటీ ఇడుపుకాయితం...నవ్విస్తూనే ఏడిపిస్తుంది

Idhupu Kayitham Movie: వెరైటీ ఇడుపుకాయితం...నవ్విస్తూనే ఏడిపిస్తుంది

వ్రాసిన వారు Balachander Sharma
Nov 12, 2026
05:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

పెళ్లంటే రెండు మనసుల కలయిక. ప్రేమతో మొదలైన ఆ బంధం జీవితాంతం కొనసాగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ, ఆ బంధంలోనే అనుకోని సమస్యలు ఎదురైతే? చివరకు విడాకుల వరకు వెళ్లాల్సి వస్తే? ఇలాంటి ఆసక్తికరమైన అంశాన్ని వినోదంతో కలిపి చూపించబోతోంది 'ఇడుపు కాయితం' సినిమా. ప్రియదర్శి, నాగదుర్గ జంటగా నటిస్తున్న ఈ చిత్ర టీజర్ తాజాగా విడుదలైంది. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కుటుంబ కథా చిత్రం నవ్విస్తూనే భావోద్వేగాలకు చోటు కల్పించబోతున్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది.

Details

పెళ్లి సందడి వెనుక అసలు కథేంటి?

ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు మాటలతో టీజర్ మొదలవుతుంది.

ఆ తర్వాత శ్రీను పాత్రలో ప్రియదర్శి, శ్రీలతగా నాగదుర్గ కనిపిస్తారు. వీరిద్దరి పరిచయం, ప్రేమ, పెళ్లి ప్రస్తావన, వివాహ వేడుకలు.. ఇలా కుటుంబంలో జరిగే సరదా సంఘటనలతో టీజర్ ముందుకు సాగుతుంది.

అయితే, తెలంగాణ మాండలికంలో 'ఇడుపు కాయితం' అంటే విడాకుల పత్రం. పెళ్లి వేడుకలతో మొదలైన వీరి ప్రయాణం విడాకుల వరకు ఎందుకు చేరిందన్న ప్రశ్న ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచుతోంది.

ఈ క్రమంలో ఎదురయ్యే కుటుంబ సమస్యలు, అపార్థాలు కథలో కీలకంగా నిలవనున్నట్లు తెలుస్తోంది.

Details

జానపద గాయనిగా గుర్తింపు.. హీరోయిన్‌గా తొలి అడుగు

తెలంగాణ జానపద పాటలు, నృత్యంతో గుర్తింపు తెచ్చుకున్న నాగదుర్గ ఈ సినిమాతో కథానాయికగా వెండితెరకు పరిచయమవుతున్నారు.

ప్రియదర్శి సహజమైన కామెడీ టైమింగ్‌కు ఆమె నటన తోడైతే తెరపై మంచి వినోదం పండే అవకాశం ఉంది.

వంశీ రెడ్డి దొండపాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సురేశ్ బొబ్బిలి సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన 'శ్రీలత', 'గడప' పాటలతో పాటు దీపావళి సందర్భంగా వచ్చిన 'బరాత్ బీట్' ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

ADVERTISEMENT

Details

డిసెంబర్ 11న థియేటర్లలోకి..

సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాస్ వర్క్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి డిసెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు నిర్మాతలు సిద్ధమవుతున్నారు.

పెళ్లి తర్వాతి జీవితంలోని సరదాలు, సమస్యలను వినోదాత్మకంగా చూపించే ప్రయత్నం 'ఇడుపు కాయితం'లో కనిపిస్తోంది.

మరి శ్రీను, శ్రీలతల కథ చివరకు ఎలాంటి మలుపు తీసుకుంటుంది? నవ్వులతో పాటు భావోద్వేగాలను కూడా పంచుతుందా? అన్నది సినిమా విడుదలయ్యాకే తెలియాలి.

ADVERTISEMENT