Loading...
Idhupu Kayitham: డిసెంబరు 11న 'ఇడుపు కాయితం' విడుదల.. ప్రియదర్శి, నాగదుర్గ మూవీ డేట్ ఫిక్స్‌!
డిసెంబరు 11న 'ఇడుపు కాయితం' విడుదల.. ప్రియదర్శి, నాగదుర్గ మూవీ డేట్ ఫిక్స్‌!

Idhupu Kayitham: డిసెంబరు 11న 'ఇడుపు కాయితం' విడుదల.. ప్రియదర్శి, నాగదుర్గ మూవీ డేట్ ఫిక్స్‌!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 23, 2026
04:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రియదర్శి, నాగదుర్గ కీలక పాత్రల్లో నటిస్తున్న ఫ్యామిలీ డ్రామా 'ఇడుపు కాయితం' విడుదల తేదీ ఖరారైంది. ఈ సినిమాను డిసెంబరు 11న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. వంశీరెడ్డి దొండపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సుకుమార్‌ రైటింగ్స్‌తో కలిసి బన్నీ వాస్‌ వర్క్స్‌ పతాకంపై బన్నీ వాస్‌ నిర్మిస్తున్నారు. టైటిల్‌ ప్రకటనతోనే ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించిన ఈ సినిమా తెలంగాణ కుటుంబ నేపథ్యంతో తెరకెక్కుతోంది. విడుదల తేదీని ప్రకటించిన నేపథ్యంలో శుక్రవారం చిత్ర బృందం 'గడప' పాట లిరికల్‌ వీడియోను విడుదల చేసింది.

వివరాలు

డిసెంబర్ 11న రిలీజ్

సురేశ్‌ బొబ్బిలి ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా.. 'గడప' పాటకు అభినయ శ్రీనివాస్‌ సాహిత్యం అందించారు.

ఈ పాటను తేలు విజయ ఆలపించారు. 'ఇడుపు కాయితం' అంటే విడాకుల పత్రం అని అర్థం.

ఈ ఆసక్తికరమైన టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం కుటుంబ సంబంధాలు, వాటి చుట్టూ సాగే కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

డిసెంబరు 11న విడుదల కానున్న ఈ ఫ్యామిలీ డ్రామాపై ఇప్పటికే ఆసక్తి నెలకొంది.

ADVERTISEMENT