LOADING...
Rashmika Mandhana: అమ్మాయిలు ఒకటై నడిస్తే అడ్డుకోగల శక్తి లేదు : రష్మిక పోస్ట్ వైరల్
అమ్మాయిలు ఒకటై నడిస్తే అడ్డుకోగల శక్తి లేదు : రష్మిక పోస్ట్ వైరల్

Rashmika Mandhana: అమ్మాయిలు ఒకటై నడిస్తే అడ్డుకోగల శక్తి లేదు : రష్మిక పోస్ట్ వైరల్

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 22, 2025
10:38 am

ఈ వార్తాకథనం ఏంటి

కథానాయిక రష్మిక మందన్న స్త్రీశక్తిపై ప్రత్యేకంగా స్పందించారు. అమ్మాయిలంతా ఒకటై నిలబడితే ఆ శక్తిని ఎవరూ ఆపలేరని ఆమె అభిప్రాయపడ్డారు. వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రష్మిక, తన భావాలను తరచూ అభిమానులతో పంచుకుంటుంటారు. తాజాగా ఆమె (Rashmika) ఫెమినిన్ ఎనర్జీ గురించి ఆసక్తికరమైన పోస్ట్ షేర్ చేశారు. 'స్త్రీశక్తిలో (Feminine Energy) ఏదో తెలియని అద్భుతం ఉంటుంది. దాన్ని మాటల్లో చెప్పడం చాలా కష్టం. ఒక స్నేహితురాలితో గాఢమైన అనుబంధం ఏర్పడితే, ఏం జరగబోతోందో ముందుగానే గ్రహించగల ఓ అద్భుతమైన భావన కలుగుతుంది. మహిళలు ఒకరికొకరు మద్దతు ఇస్తూ, పరస్పర సమస్యలు వింటే వారి జీవితం ఎంతో సులభమవుతుంది.

Details

అద్భుతమైన స్నేహితురాళ్లు ఉండాలి

స్త్రీలు సహజంగానే ఒకరిపై ఒకరు ఎంతో ప్రేమగా, ఆదరణగా ఉంటారు. ఒకరి పరిస్థితిని ఇంకొరు అర్థం చేసుకుని ఆప్యాయంగా ధైర్యం చెబుతారు. అవసరమైనప్పుడు 'నేను నీకు అండగా ఉన్నాను' అనే నమ్మకాన్ని ఇస్తారని రష్మిక పేర్కొన్నారు. అదే విధంగా, స్త్రీ శక్తి అంటే ఏమిటో గ్రహించడానికి తనకు చాలా కాలం పట్టిందని కూడా ఆమె తెలిపారు. 'నా చుట్టూ ఉన్న స్నేహితులు ఎల్లప్పుడూ నాకు తోడుగా ఉంటూ, నన్ను రక్షిస్తున్నారు. అమ్మాయిలు బలహీనులు అనే అభిప్రాయం పూర్తిగా తప్పు. వారు ఎంతో బలమైనవారు, ప్రేమతో నిండినవారు. మీ అందరి జీవితాల్లో కూడా అలాంటి అద్భుతమైన స్నేహితురాళ్లు ఉండాలని నేను కోరుకుంటున్నానని రష్మిక అన్నారు.