Devara: 'దేవర' విజువల్స్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. హైప్ పెంచిన ఛాయాగ్రాహకుడు
ఎన్టీఆర్ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'దేవర'పై అంచనాలు రోజు రోజుకూ ఆకాశాన్నంటుతున్నాయి. సెప్టెంబర్ 27న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ముఖ్యంగా ఈ సినిమాలో వీఎఫ్‌ఎక్స్ గురించి ఛాయాగ్రాహకుడు రత్నవేలు చేసిన కామెంట్స్ హైప్ ను మరింత క్రియేట్ చేశాయి. కలర్ గ్రేడింగ్, మ్యాచింగ్, భారీ వీఎఫ్‌ఎక్స్ కోసం 30 రోజులకు పైగా రాత్రులు కష్టపడ్డానని, లార్జ్ ఫార్మట్, డీ బాక్స్, 4డీఎక్స్ వంటి టెక్నాలజీలతో సినిమా మరింత ఎత్తుకు చేరుతుందని రత్నవేలు పేర్కొన్నారు.
'థియోటర్లలో పూనకాలు పక్కా' అంటూ పోస్టు
వీఎఫ్‌ఎక్స్ వర్క్‌లో భాగంగా జూనియర్ ఎన్టీఆర్‌తో దిగిన ఫొటోను కూడా ఆయన షేర్ చేశారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ గ్రేస్, స్టైల్, ఎనర్జీ ఫుల్ డ్యాన్స్ స్టెప్స్ ప్రేక్షకులను ఉత్సాహంతో ఉర్రూతలూగిస్తాయని రత్నవేలు ధీమా వ్యక్తం చేశారు. థియేటర్లలో పూనకాలు పక్కా అంటూ అభిమానుల్లో ఉత్సాహం నింపారు. ఇక ఈ చిత్రంతో 'జాన్వీ కపూర్' తెలుగు తెరపై ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే.