
Shihan Hussaini: ప్రమాదకర స్టంట్స్‌కు కేరాఫ్ అడ్రస్.. షిహాన్ హుసైని
ఈ వార్తాకథనం ఏంటి
షిహాన్ హుసైని కేవలం కరాటే లెజెండ్ మాత్రమే కాదు, అంతకుమించి గొప్ప స్టంట్ మాస్టర్ కూడా.
ఆయనలో చిత్రకారుడు, విలువిద్య నిపుణుడు, యోధుడు వంటి అనేక కోణాలున్నాయి.
మార్షల్ ఆర్ట్స్‌లో ఎందరో శిష్యులకు శిక్షణ ఇచ్చిన హుసైని, నటుడిగానూ వెండితెరపై తనదైన ముద్ర వేశారు.
గత కొంతకాలంగా బ్లడ్ క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన, చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.
తన కెరీర్ మొత్తం రిస్క్ ఫుల్ స్టంట్స్‌తోనే కొనసాగించిన హుసైని, ఆ విధంగా అందరి కంటే భిన్నంగా నిలిచారు. ఆయన చేసిన ప్రతీ స్టంట్ ఒళ్లుని గగుర్పొడిచేలా ఉంటుంది.
వివరాలు
హుసైని డేర్ డెవిల్ స్టంట్స్
హుసైని చేసే ప్రతి పని అత్యంత ప్రమాదకరంగా ఉండేది. 2015లో చేసిన ఒక సాహసం అతనికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చింది.
ఆయన 300 కిలోల బరువైన చెక్క శిలువును ఆయన మోశారు. అది మాత్రమే కాదు—చేతులు, కాళ్లకు మేకులు కూడా పొడిపించుకున్నారు.
తమిళనాడు సీఎం జయలలిత గెలవాలని ఈ చర్య చేపట్టారు. జయలలిత పుట్టినరోజు సందర్భంగా తన రక్తంతో ఆమె 56 చిత్రాలను గీయడం, 2013లో 11 లీటర్ల రక్తాన్ని గడ్డ కట్టించి జయలలిత ముఖచిత్రాన్ని తయారు చేయడం సంచలనంగా మారింది.
అయితే, ఈ విషయం తెలిసిన జయలలిత, హుసైనిని పిలిపించి సున్నితంగా హెచ్చరించారు.
వివరాలు
హుసైని రికార్డ్ బ్రేకింగ్ స్టంట్స్
అదే విధంగా, 22 అడుగుల పోప్ జాన్ పాల్ 2 కాంస్య విగ్రహంతో పాటు, భారత మహిళా వ్యోమగామి కల్పనా చావ్లా విగ్రహాన్ని చెక్కడం కూడా హుసైని ప్రతిభకు నిదర్శనం.
శ్రీలంక మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్స చిత్రాన్ని తన పందిరక్తంతో గీసిన ఘటన కూడా అప్పట్లో చర్చనీయాంశమైంది.
హుసైని చేసిన ప్రతి స్టంట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వాల్సిందే. ఆయన కుడిచేతిపై 101 కార్లు పోనించుకోవడమే కాకుండా,అదే చేత్తో 5,000 టైల్స్, 1,000 ఇటుకలను పగలగొట్టారు.
ఈ డేరింగ్ ఫీట్ యూత్‌లో హుసైనికి విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది.అంతేగాక, అత్యంత విషపూరితమైన నాగుపాము కాటుకు గురై ప్రాణాపాయ స్థితిలో ఉన్నా,తిరిగి బతికి బయటపడ్డారు.
వివరాలు
జైలుకు వెళ్లిన అనుభవం
140 లీటర్ల పెట్రోల్‌తో మంటలు వెలిగించి, వాటిలో నుంచి సజీవంగా బయటకు రావడం కూడా ఆయన అద్భుతమైన ధైర్యానికి నిదర్శనం.
1980లో పొరపాటున హుసైనిని శ్రీలంక టెర్రరిస్ట్ అనుకుని భారత పోలీసులు అరెస్టు చేశారు.
అనంతరం, తీహాడ్ జైలుకు తరలించగా, నిజం తెలిసిన తర్వాత విడుదల చేశారు.
1994లో అమెరికాలో జరిగిన "ఇస్సిన్యూర్ వరల్డ్ కరాటే అసోసియేషన్ ఛాంపియన్‌షిప్" పోటీల్లో కూడా హుసైని పాల్గొన్నారు.
వివరాలు
సినీ కెరీర్
హుసైని 1986లో విడుదలైన "పున్నగై మన్నన్" సినిమా ద్వారా తమిళ చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టారు.
పలు చిత్రాల్లో నటించినా, విజయ్ హీరోగా నటించిన "బద్రి" సినిమా ఆయనకు ప్రత్యేక గుర్తింపునిచ్చింది.
హుసైని జీవితమంతా సాహసాలే. తన ప్రాణాలను పణంగా పెట్టి చేసిన స్టంట్స్ వల్లే ఆయన మరణానంతరం కూడా అభిమానుల్లో సజీవంగా ఉండిపోతారు.