Irumudi: రూ.200 కోట్ల క్లబ్‌లోకి రవితేజ మూవీ.. ఇరుముడి పరుగు ఎక్కడికి?
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ బాక్సాఫీస్ చరిత్రలో కొన్ని సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటారు. అంచనాలకు అందకుండా, లెక్కలకు చిక్కకుండా అవి చేసే అద్భుతాలు ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి. పాతికేళ్ల క్రితం 'నువ్వే కావాలి' సినిమా విడుదలైనప్పుడు అది 200 రోజులు ఆడుతుందని, స్టార్ హీరోల సినిమాలకు మాత్రమే సాధ్యమయ్యే రికార్డులను బద్దలు కొడుతుందని ఎవరూ ఊహించలేదు. కానీ ఆ సినిమా చరిత్ర సృష్టించింది. అయితే పాన్ ఇండియా ట్రెండ్ వచ్చిన తర్వాత ఇలాంటి అద్భుతాలు చాలా అరుదుగా కనిపిస్తున్నాయి.
వివరాలు
20 రోజులు పూర్తికాకముందే భారీ వసూళ్లు..
గత నెల విడుదలైన 'ఇరుముడి' మరోసారి ఆ రోజులను గుర్తు చేస్తోంది.
విడుదలై 20 రోజులు కూడా పూర్తికాకముందే సగర్వంగా రూ.200 కోట్ల క్లబ్బులోకి అడుగుపెట్టి విజయకేతనం ఎగరేసింది.
చాలా చోట్ల చిన్న సెంటర్లలో ఒక సినిమా వారం రోజులు ఆడితేనే గొప్పగా భావించే పరిస్థితుల్లో.. 13 రోజుల తర్వాత కూడా మంచి ఆక్యుపెన్సీలు నమోదు కావడం చూసి బయ్యర్లు సైతం ఆశ్చర్యపోతున్నారు.
రూపాయికి ఐదు రూపాయల లాభం అనే మాట వినడమే కానీ.. ఇటీవలి కాలంలో దాన్ని చేసి చూపించిన సినిమా 'ఇరుముడి'నే.
ఇప్పటికీ పలు ప్రాంతాల్లో ప్రేక్షకులు తండోపతండాలుగా థియేటర్లకు వస్తున్నారు.
వివరాలు
మక్తల్‌లో సినిమా కోసం ధర్నా..
కొన్ని చోట్ల షోలు లేవని అభిమానులు, ప్రేక్షకులు గొడవలకు దిగిన సందర్భాలు కూడా కనిపించాయి.
మక్తల్‌లో పరిస్థితి ఏకంగా ప్రేక్షకులు ధర్నా చేసే స్థాయికి వెళ్లింది.
'టాక్సిక్' సినిమా సైతం 'ఇరుముడి' ప్రభావాన్ని తట్టుకోలేక కొన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్లను వెనక్కి ఇవ్వాల్సి వచ్చింది.
పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా కుటుంబాలు బండ్లు, వాహనాలు వేసుకుని 'ఇరుముడి' చూసేందుకు వెళ్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఇవన్నీ భవిష్యత్తులో ఈ సినిమా విజయాన్ని గుర్తు చేసుకునే జ్ఞాపకాలుగా మిగిలిపోనున్నాయి.
వివరాలు
మరింత దూకుడుగా సినిమా..
అయితే 'ఇరుముడి' పరుగు ఇక్కడితో ఆగేలా కనిపించడం లేదు. మరో వీకెండ్ కూడా సినిమాకు స్వాగతం పలుకుతోంది.
కొత్త సినిమాలు బోలెడున్నా.. సెలవు వచ్చిందంటే చాలు కుటుంబాలు 'ఇరుముడి' వైపే అడుగులు వేస్తున్నాయి.
ఇప్పటివరకు సినిమా చూడని వారు ఓటీటీ కోసం కూడా ఎదురుచూడటం లేదు.
ఒక్కసారైనా థియేటర్ ఎక్స్‌పీరియన్స్ పొందాలనే ఉద్దేశంతో గంపగుత్తగా టికెట్లు కొనుగోలు చేస్తున్నారు.
ప్రస్తుతం సినిమా దూకుడు చూస్తుంటే 'ఇరుముడి' రూ.250 కోట్ల మార్క్‌ను కూడా అందుకునేలా కనిపిస్తోంది.
రవితేజ, శివ నిర్వాణ, నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్, జి.వి. ప్రకాశ్ కుమార్ తదితరులకు ఈ విజయం ఇచ్చిన కిక్ వెయ్యి ఏనుగుల బలంతో సమానమనే చెప్పాలి.