Loading...
Andhra Pradesh: కొత్త జిల్లాల్లో రోస్టర్ పాయింట్ ఒకటి నుంచే.. రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
కొత్త జిల్లాల్లో రోస్టర్ పాయింట్ ఒకటి నుంచే.. రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు

Andhra Pradesh: కొత్త జిల్లాల్లో రోస్టర్ పాయింట్ ఒకటి నుంచే.. రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 03, 2026
09:22 am

ఈ వార్తాకథనం ఏంటి

రాష్ట్రపతి ఉత్తర్వులు-2025 అమలుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. స్థానిక క్యాడర్ల ఏర్పాటు, ప్రత్యక్ష నియామకాల్లో స్థానిక అభ్యర్థుల రిజర్వేషన్లు, రోస్టర్ పాయింట్ల నిర్వహణ, క్యారీ ఫార్వర్డ్ ఖాళీల సర్దుబాటుపై సాధారణ పరిపాలన శాఖ స్పష్టతనిచ్చింది. ప్రత్యక్ష నియామకాల్లో స్థానిక అభ్యర్థులకు 95 శాతం రిజర్వేషన్‌ అమలు కానుంది. మిగిలిన 5 శాతం పోస్టులు స్థానికేతర అభ్యర్థులకు అందుబాటులో ఉంటాయి. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం గతంలో ఉన్న 13 జిల్లాలను 26 జిల్లాలుగా పునర్వ్యవస్థీకరించారు. అలాగే నాలుగు పాత జోన్ల స్థానంలో ఆరు జోన్లు, రెండు కొత్త మల్టీజోన్లు ఏర్పాటు చేశారు. డిప్యూటీ కలెక్టర్, డీఎస్సీ తదితర రాష్ట్రస్థాయి పోస్టులను మల్టీజోన్‌ క్యాడర్ల పరిధిలోకి తీసుకొచ్చారు.

వివరాలు 

ఆర్థికశాఖ అనుమతి పొందిన తర్వాత నియామక ప్రక్రియ

పాత జిల్లాలు,జోన్లకు సంబంధించి గతంలో రోస్టర్‌ సైకిల్‌ ఏ పాయింట్‌ వద్ద ముగిసిందో.. ఆ తర్వాతి పాయింట్‌ నుంచే నియామక ప్రక్రియను కొనసాగిస్తారు.

అయితే కొత్తగా ఏర్పాటైన జిల్లాలు,జోన్‌-2,జోన్‌-5లో మాత్రం రోస్టర్‌ పాయింట్లను ఒకటి నుంచి కొత్తగా ప్రారంభించనున్నారు.

జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఉన్న క్యారీ ఫార్వర్డ్‌ ఖాళీలను సంబంధిత యూనిట్ల క్యాడర్‌ స్ట్రెంక్త్‌ ఆధారంగా కొత్తజిల్లాలకు కేటాయిస్తారు.ఈఖాళీల సర్దుబాటు క్యాడర్‌ బలానికి అనుగుణంగా చేపట్టనున్నారు.

ప్రతి శాఖ పరిధిలో అందుబాటులో ఉన్న ఖాళీలను ముందుగా లెక్కిస్తారు.

అనంతరం ఆఖాళీలకు ఆర్థికశాఖ అనుమతి పొందిన తర్వాత నియామక ప్రక్రియను ముందుకు తీసుకెళ్తారు.

ఆమోదం లభించిన పోస్టుల వివరాలను ఏపీపీఎస్సీతో పాటు ఇతర నియామక సంస్థలకు పంపి, నోటిఫికేషన్లు జారీ చేసేలా చర్యలు చేపడతారు.

ADVERTISEMENT