Loading...
Womens champions trophy: భారత్‌లో మహిళల ఛాంపియన్స్‌ ట్రోఫీ..
భారత్‌లో మహిళల ఛాంపియన్స్‌ ట్రోఫీ..

Womens champions trophy: భారత్‌లో మహిళల ఛాంపియన్స్‌ ట్రోఫీ..

వ్రాసిన వారు Moogati Shabari
Sep 03, 2026
09:23 am

ఈ వార్తాకథనం ఏంటి

మహిళల క్రికెట్‌లో తొలిసారిగా నిర్వహించనున్న ఛాంపియన్స్‌ ట్రోఫీ ఆతిథ్య హక్కులను ఐసీసీ శ్రీలంక నుంచి భారత్‌కు మార్చింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం వచ్చే ఏడాది జరగనున్న ఈ టోర్నీకి శ్రీలంక ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. అయితే ఆ దేశ క్రికెట్‌ పాలనా వ్యవహారాల్లో నెలకొన్న సమస్యల నేపథ్యంలో టోర్నీని మరో దేశానికి తరలించాలని ఐసీసీ నిర్ణయించింది. భారత్‌తో పాటు దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌లో టోర్నీ నిర్వహించే అవకాశాలను పరిశీలించిన ఐసీసీ.. చివరకు ఆతిథ్య హక్కులను భారత్‌కు కట్టబెట్టింది. ఫిబ్రవరి 14 నుంచి 28 వరకు జరగనున్న మహిళల ఛాంపియన్స్‌ ట్రోఫీకి ముంబయి, వదోదరాలను వేదికలుగా ఖరారు చేసింది.

వివరాలు

తొలి ఆరు స్థానాల్లో ఉన్న జట్లు ఇవే..

మహిళల టీ20 క్రికెట్‌లో ఈ ఏడాది జులై 6 నాటికి ర్యాంకింగ్స్‌లో తొలి ఆరు స్థానాల్లో ఉన్న జట్లు ఈ టోర్నీలో పాల్గొంటాయి.

భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్లు ఛాంపియన్స్‌ ట్రోఫీకి అర్హత సాధించాయి.

రౌండ్‌ రాబిన్‌ పద్ధతిలో లీగ్‌ దశ మ్యాచ్‌లు జరుగుతాయి. ఇందులో తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లు ఫైనల్‌లో తలపడతాయి.

పురుషుల ఛాంపియన్స్‌ ట్రోఫీని 50 ఓవర్ల ఫార్మాట్‌లో నిర్వహిస్తుండగా.. మహిళల ఛాంపియన్స్‌ ట్రోఫీని టీ20 ఫార్మాట్‌లో నిర్వహించాలని ఐసీసీ నిర్ణయించింది.

ADVERTISEMENT