Balakrishna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీలో బాలయ్య రోల్ అంతేనా? అసలు ప్లాన్ ఇదేనా?
ఈ వార్తాకథనం ఏంటి
నందమూరి వారసుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న అభిమానులకు ఇటీవలే ఓ గుడ్‌న్యూస్ అందింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై దర్శకుడు వశిష్ట కాంబినేషన్‌లో మోక్షజ్ఞ డెబ్యూ ప్రాజెక్ట్ ఖరారైంది. దీంతో నందమూరి అభిమానుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ అయినప్పటి నుంచి మరో ఆసక్తికరమైన వార్త ఫిలిం సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. తన కుమారుడి తొలి సినిమాలో నందమూరి బాలకృష్ణ కూడా తెరపై కనిపించబోతున్నారనే ప్రచారం. అయితే ఈ సినిమాలో బాలయ్య కనిపిస్తే ఆయన పాత్ర ఎలా ఉండబోతుందనే అంశంపై ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.
వివరాలు
కొడుకు సినిమా.. బాలయ్య పాత్రపై ప్రత్యేక ఫోకస్!
మోక్షజ్ఞ తొలి సినిమా కావడంతో నందమూరి అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇలాంటి సమయంలో దర్శకుడు వశిష్టకు ఓ కీలకమైన సవాలు ఎదురైనట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
నటసింహం నందమూరి బాలకృష్ణ తెరపై కనిపిస్తే థియేటర్లు ఈలలు, కేకలతో మారుమోగడం ఖాయం. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ అలాంటిది. పక్కన ఎంత పెద్ద హీరో ఉన్నా తనదైన నటన, ఇమేజ్‌తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించగలరు.
మోక్షజ్ఞ డెబ్యూ సినిమాలో బాలయ్య ఎక్కువసేపు కనిపిస్తే పరిస్థితి మరోలా మారే అవకాశం ఉంది.
కొత్త హీరోగా మోక్షజ్ఞ పరిచయం వెనుకబడిపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అందుకే తండ్రి ఇమేజ్ కొడుకు ఎంట్రీని డామినేట్ చేయకుండా దర్శకుడు ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్లు ప్రచారం జరుగుతోంది.
వివరాలు
కథ ప్రారంభంలోనే పవర్‌ఫుల్ గెస్ట్ రోల్?
ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం.. సినిమా మొత్తం బాలయ్యను చూపించకుండా, కథ ప్రారంభంలోనే కొద్దిసేపు ఓ పవర్‌ఫుల్ గెస్ట్ రోల్‌లో పరిచయం చేయాలని దర్శకుడు వశిష్ట భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఆ కొద్దిసేపటి ఎంట్రీతోనే కథకు అదిరిపోయే ఊపు తీసుకొచ్చి, ప్రేక్షకుల్లో భారీ హైప్ క్రియేట్ చేయాలనేది చిత్ర బృందం వ్యూహమనే ప్రచారం సాగుతోంది.
ఆ తర్వాత కథను మోక్షజ్ఞ చేతుల్లో పెట్టి బాలయ్య పాత్ర పక్కకు తప్పుకుంటుందని టాక్.
ఇలా తక్కువ సమయంలోనే తనదైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో థియేటర్లలో సందడి చేయడంతో పాటు, కొత్త హీరోగా మోక్షజ్ఞ పాత్రకు ఎలివేషన్ ఇచ్చే అవకాశం ఉంటుందని భావిస్తున్నారట.
వివరాలు
బాలయ్య ఇమేజ్.. మోక్షజ్ఞకు ప్లస్ అయ్యేలా ప్లాన్?
మోక్షజ్ఞ తొలి సినిమాకు బాలకృష్ణ తోడైతే బాక్సాఫీస్ వద్ద భారీ బజ్ ఏర్పడుతుందనడంలో సందేహం లేదు. అయితే అదే సమయంలో కొత్త హీరోగా మోక్షజ్ఞ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడం కూడా ముఖ్యమే.
తండ్రి స్టార్‌డమ్ కొడుకు ఎదుగుదలకు అడ్డంకిగా మారకుండా, అదే ఇమేజ్‌ను మోక్షజ్ఞకు ఉపయోగపడేలా మలచడమే ఈ వ్యూహం వెనుక ఉన్న ఉద్దేశమని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
అయితే బాలకృష్ణ ఈ సినిమాలో నిజంగానే కనిపిస్తారా? కనిపిస్తే ఆయన పాత్ర నిడివి ఎంత? గెస్ట్ రోల్‌కే పరిమితమవుతారా? అనే ప్రశ్నలకు ఇప్పటివరకు అధికారిక సమాధానం లేదు.
ప్రస్తుతం ఇవన్నీ ఇండస్ట్రీలో వినిపిస్తున్న ప్రచారాలు మాత్రమే. చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన వస్తేనే ఈ విషయాలపై స్పష్టత రానుంది.