
Homebound: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఎంపికైన 'హోమ్ బౌండ్' సినిమా.. భారతీయ సినిమా ప్రపంచాన్ని ఆకర్షిస్తోందంటూ జాన్వీ పోస్ట్
ఈ వార్తాకథనం ఏంటి
నీరజ్ ఘైవాన్ దర్శకత్వంలో తెరకెక్కిన రెండో చిత్రం 'హోమ్ బౌండ్'.
ప్రముఖ నటులు ఇషాన్ ఖట్టర్, జాన్వీ కపూర్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా, ఈ ఏడాది జరగనున్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శితం కానుంది.
ఈగౌరవాన్ని పొందిన నేపథ్యంలో,జాన్వీ కపూర్ తన ఆనందాన్ని సోషల్ మీడియాలో వ్యక్తపరిచారు.
జాన్వీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ ద్వారా స్పందిస్తూ.. ''భారతీయ సినిమాకు ఇది మరొక గర్వకారణమైన ఘడియ. 78వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మా సినిమా 'హోమ్ బౌండ్' ప్రదర్శించబడనుంది. మా టీమ్‌కు ఇది గొప్ప గౌరవం. మా హృదయాలు ఆనందంతో నిండిపోయాయి. ఈ సినిమాను ప్రపంచ ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం'' అని పేర్కొన్నారు.
వివరాలు
2015లో సినీ రంగంలోకి నీరజ్ ఘైవాన్
ఈ ఏడాది కేన్స్‌కు ఎంపికైన ఏకైక భారతీయ చిత్రం 'హోమ్ బౌండ్' కావడం గమనార్హం.
దీనిపై నిర్మాత కరణ్ జోహార్ కూడా స్పందిస్తూ.. ''భారతీయ సినిమాకు ఇది ఒక ఉదాహరణ. 'హోమ్ బౌండ్' మన కథల సౌందర్యాన్ని అంతర్జాతీయంగా పరిచయం చేస్తోంది. ఈ విజయం మొత్తం ఇండియన్ సినిమా రంగానికి చెందింది. రాబోయే సినిమాలకు ఇది మార్గదర్శకంగా నిలవగలదు'' అని ఇన్‌స్టాలో పోస్టు చేశారు.
తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌కు చెందిన దర్శకుడు నీరజ్ ఘైవాన్ 2015లో సినీ రంగంలోకి అడుగుపెట్టారు.
ఆయన తెరకెక్కించిన తొలి చిత్రం 'మసాన్' కూడా అప్పట్లో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడింది.
వివరాలు
మే 13 నుంచి 24 వరకు ఫ్రాన్స్‌లో 78వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్
రిచా చద్దా,విక్కీ కౌశల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ద్వారా ఆయన అంతర్జాతీయంగా గుర్తింపు పొందారు.
ఇప్పుడు రెండోసారి కూడా ఆయన దర్శకత్వంలో వచ్చిన చిత్రం కేన్స్‌కు ఎంపిక కావడంతో ఆయనపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
78వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఈ సంవత్సరం మే 13 నుంచి 24 వరకు ఫ్రాన్స్‌లో జరుగనుంది.
ఈ వేడుకల వివరాలను నిర్వాహకులు తాజాగా గురువారం వెల్లడించారు.