LOADING...
Naga Chaitanya : ఓ మెసెజ్‌తో మొదలైంది. సీక్రెట్ ప్రేమకథను బయటపెట్టిన నాగ చైతన్య
ఓ మెసెజ్‌తో మొదలైంది. సీక్రెట్ ప్రేమకథను బయటపెట్టిన నాగ చైతన్య

Naga Chaitanya : ఓ మెసెజ్‌తో మొదలైంది. సీక్రెట్ ప్రేమకథను బయటపెట్టిన నాగ చైతన్య

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 07, 2025
02:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

యంగ్ అక్కినేని హీరో నాగ చైతన్య ప్రస్తుతం తన కెరీర్‌లో బిజీగా ఉన్నాడు. 'తండేల్' సినిమా సూపర్‌ హిట్‌ కావడంతో ఆయన ఫుల్‌ జోష్‌లో ఉన్నాడు. మరోవైపు వ్యక్తిగత జీవితంలోనూ చై కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాడు. ఇటీవలే నటి శోభితను వివాహం చేసుకున్న చైతన్య ఇప్పుడు వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నాడు. వీరి పెళ్లి అక్కినేని నాగేశ్వరరావు స్థాపించిన అన్నపూర్ణ స్టూడియోస్‌లో డిసెంబర్‌లో ఘనంగా జరిగింది. దీంతో చైతన్య జీవితంలో మరో కీలక మలుపు తిరిగింది. అయితే చాలామందికి వీరి లవ్ స్టోరీ ఎలా మొదలైందనే ఆసక్తి ఎక్కువగా ఉంది. ఈ ప్రశ్నకు నాగ చైతన్య తాజాగా సమాధానం ఇచ్చాడు.

Details

ఆ పరిచయం ప్రేమగా మారింది

జగపతి బాబు నిర్వహించిన టాక్ షో 'జయమ్ము నిశ్చయమ్ము రా'లో పాల్గొన్న 'చై' తన ప్రేమకథను వివరించాడు. "ఒకసారి నేను ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ పెట్టాను. దానికి శోభిత రిప్లై ఇచ్చింది. అలా మా చాట్ మొదలైంది. తర్వాత మెసేజ్‌లు మారుతూ మెల్లగా మేమిద్దరం దగ్గరయ్యాం. కొద్ది రోజులకే ప్రత్యక్షంగా కలుసుకున్నాం. ఆ పరిచయం ప్రేమగా మారి చివరికి పెళ్లి వరకు వచ్చిందని చై చెప్పాడు. అంటే సోషల్ మీడియా పోస్ట్‌తో మొదలైన చిన్న పరిచయం చివరకు జీవిత బంధంగా మారిందని నాగ చైతన్య వెల్లడించాడు. ప్రస్తుతం ఆయన దర్శకుడు కార్తీక్ వర్మతో కలిసి 'విరూపాక్ష' అనే సస్పెన్స్ థ్రిల్లర్‌ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా గురించి కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.