పెళ్లికి ఎస్ చెప్పిన గాలోడు సుధీర్?
జబర్దస్త్ కామెడీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సుధీర్, ఆ తర్వాత సుడిగాలి సుదీర్ గా పేరు తెచ్చుకున్నాడు. కమెడియన్ గా మాత్రమే కాకుండా టీవీ షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ టెలివిజన్ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ఇదే క్రమంలో వెండితెర మీద హీరోగా మెరిశాడు. త్రీ మంకీస్, సాఫ్ట్ వేర్ సుధీర్, గాలోడు చిత్రాలతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రవేశించాడు. ఈ మూడు సినిమాల్లో గాలోడు చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా సుధీర్ పెళ్లి విషయమై సోషల్ మీడియాలో ఒక వార్త హల్ చల్ చేస్తోంది. మరికొద్ది రోజుల్లో సుధీర్ పెళ్లి చేసుకోబోతున్నాడని, వరుసకు మరదలయ్యే అమ్మాయిని వివాహం ఆడబోతున్నాడని వినిపిస్తోంది.
రష్మితో ప్రేమాయణంపై అనేక వార్తలు
గత కొన్ని రోజులుగా సుధీర్ పెళ్లి గురించి చాలా వార్తలు వచ్చాయి. జబర్దస్త్ యాంకర్ అయిన రష్మితో సుధీర్ లవ్ లో ఉన్నాడని అనేక పుకార్లు పుట్టుకొచ్చాయి. టెలివిజన్ స్క్రీన్ మీద వీరిద్దరి కెమిస్ట్రీ కూడా బాగుండడంతో, వీరు లవ్ లో ఉన్నారని జనాలు కన్ఫామ్ చేసుకున్నారు. కానీ తమ మధ్య ఎలాంటి బంధం లేదని, కనీసం స్నేహం కూడా లేదని రష్మీ కన్ఫామ్ చేయడంతో, వీరిద్దరి బంధంపై వార్తలు తగ్గిపోయాయి. ప్రస్తుతం సుధీర్ పెళ్లి కన్ఫామ్ అయిపోయిందని అంటున్నారు. వరుసకు మరదలయ్యే దూరపు బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడని, మరికొద్ది రోజుల్లో ఈ విషయమై అధికారికంగా సమాచారం బయట పెడతారని వినిపిస్తోంది.