Loading...
Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో 'జైలర్ 2' గ్రాండ్ ఈవెంట్.. ఎప్పుడంటే? పూర్తి వివరాలివే!
హైదరాబాద్‌లో 'జైలర్ 2' గ్రాండ్ ఈవెంట్.. ఎప్పుడంటే? పూర్తి వివరాలివే!

Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో 'జైలర్ 2' గ్రాండ్ ఈవెంట్.. ఎప్పుడంటే? పూర్తి వివరాలివే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 12, 2026
09:35 am

ఈ వార్తాకథనం ఏంటి

సూపర్‌స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ 'జైలర్ 2' ప్రమోషన్స్ తెలుగు రాష్ట్రాల్లో జోరందుకున్నాయి. తొలి భాగం 'జైలర్'కు తెలుగు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించడంతో, సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో అందరినీ ఆశ్చర్యపరుస్తూ చిత్ర బృందం సొంత ఇండస్ట్రీ అయిన కోలీవుడ్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్‌ను పూర్తిగా పక్కన పెట్టింది. అయితే తెలుగు మార్కెట్‌కు ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్‌లో గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు సిద్ధమైంది. అక్టోబర్ 12న సాయంత్రం 5 గంటల నుంచి హైదరాబాద్‌లోని శిల్ప కళావేదికలో ఈ వేడుక జరగనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది.

వివరాలు

అభిమానుల్లో ఆసక్తి

దీంతో 'జైలర్ 2' ప్రీరిలీజ్ ఈవెంట్‌పై అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. ముఖ్యంగా ఈ భారీ వేడుకకు సూపర్‌స్టార్ రజనీకాంత్ స్వయంగా హాజరవుతారా? లేదా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

తమ అభిమాన నటుడిని ప్రత్యక్షంగా చూసేందుకు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరోవైపు, ఈ వేడుకలో తెలుగు డిస్ట్రిబ్యూటర్, ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఏం మాట్లాడతారన్న దానిపైనా అందరి దృష్టి నెలకొంది.

ముఖ్యంగా సినిమాల టికెట్ ధరల పెంపు అంశంపై ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడిస్తారా? ఈ విషయంపై కీలక వ్యాఖ్యలు చేస్తారా? లేక ఈ అంశాన్ని పూర్తిగా పక్కన పెడతారా? అన్నది ఆసక్తికరంగా మారింది.

వివరాలు

ఈవెంట్ నిర్వహణకు సిద్ధమైన చిత్ర బృందం

మొత్తంగా కోలీవుడ్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్ లేకుండానే తెలుగు ప్రేక్షకుల కోసం హైదరాబాద్‌లో గ్రాండ్ ఈవెంట్ నిర్వహించేందుకు 'జైలర్ 2' చిత్ర బృందం సిద్ధమవుతోంది.

ఈ వేడుకకు రజనీకాంత్ హాజరుపై నెలకొన్న ఉత్కంఠ, టికెట్ ధరల పెంపుపై నాగవంశీ స్పందనపై ఆసక్తి.. ఇలా పలు అంశాలు ఈ కార్యక్రమంపై అంచనాలను పెంచుతున్నాయి.

ADVERTISEMENT