jana nayagan postponed: జన నాయగన్ సెన్సేషనల్ వాయిదా.. సినీ చరిత్రలోనే అతి పెద్ద రిఫండ్
ఈ వార్తాకథనం ఏంటి
సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రావాల్సిన తమిళ స్టార్ విజయ్ చివరి చిత్రం 'జన నాయగన్' విడుదల వాయిదా పడింది. సినిమా సెన్సార్ సమస్యల కారణంగా ప్రస్తుతానికి ప్రేక్షకుల ముందు రాలేదని కేవీఎన్ ప్రొడక్షన్స్ అధికారికంగా తెలియజేసింది. ముందుగా జనవరి 9కి సినిమా విడుదల చేసేందుకు ప్లాన్ చేసినట్లు చిత్రబృందం ప్రకటించగా, ఓవర్సీస్ సహా పలు ప్రాంతాల్లో టికెట్ బుకింగ్స్ కూడా ప్రారంభించబడిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు సినిమా వాయిదా పడటంతో బుక్ మై షో ద్వారా ముందే కొనుగోలు చేసిన టికెట్‌లకు రిఫండ్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. అభిమానులు సినిమా సజావుగా విడుదల అవుతుందని ఆశ పడినప్పటికీ, ఈ సారి పరిస్థితి మారింది.
వివరాలు
చరిత్రలో అత్యధిక రిఫండ్
బుధవారం వరకు బుక్ మై షో ద్వారా 4.50 లక్షల టికెట్లు అడ్వాన్స్ బుకింగ్‌ల రూపంలో అమ్ముడయ్యాయి. ఈ టికెట్‌లకు సంబంధించిన మొత్తం రిఫండ్ ప్రక్రియను బుక్ మై షో ప్రారంభించింది. ట్రేడ్ వర్గాలు దీన్ని చరిత్రలో అత్యధిక రిఫండ్‌గా అంచనా వేస్తున్నాయి. ఇండియన్ సినిమా చరిత్రలో ఇంత పెద్ద పరిమాణంలో టికెట్లను రద్దు చేసి తిరిగి చెల్లించడం ఇదే తొలిసారి అని పేర్కొంటున్నారు. మరోవైపు థియేటర్స్‌లో బుకింగ్ చేసుకున్న వాళ్లకు అక్కడే రిఫండ్ చేస్తున్నారు.
వివరాలు
వివాదాలతోనే విజయ్ కెరీర్ సావాసం...
విజయ్ కెరీర్‌లో సినిమాలు వివాదాలతో కొనసాగడం కొత్త విషయం కాదు. గత కొన్ని సంవత్సరాలుగా ఆయన నటించిన ప్రతి చిత్రం విడుదలకు ముందే వివాదాల చర్చలకు దారి తీస్తూ, రాష్ట్రవ్యాప్తంగా వార్తల్లో నిలుస్తున్నాయి. 'కావలన్' - లా అండ్ ఆర్డర్ సమస్యలు 'తుపాకి' - పలు ప్రాంతాల్లో ఆందోళనలు 'తలైవా' - రాజకీయ దుమారం 'కత్తి' - శ్రీలంకన్ వివాదం 'పులి' - ఫైనాన్స్, డిస్ట్రిబ్యూషన్ సమస్యలు 'మెర్సెల్' - జీఎస్టీ, యానిమల్ వెల్ఫేర్ నోటీసులు 'సర్కార్' - రాజకీయ విమర్శలు 'మాస్టర్' - కోవిడ్ ప్రభావం 'వారిసు' - తక్కువ థియేటర్స్ కేటాయింపు పై ఆందోళనలు 'లియో' - పరిమిత షోలకు మాత్రమే అనుమతి
వివరాలు
'జన నాయగన్'కు సెన్సార్ సమస్యలు
ఇలాంటి నేపథ్యంతో ఇప్పుడు 'జన నాయగన్'కు సెన్సార్ సమస్యలు ఎదురయ్యాయి. సీబీఎఫ్‌సీ సూచనల మేరకు మార్పులు చేసినప్పటికీ, బోర్డు సభ్యుల్లో ఒకరు అభ్యంతరం వ్యక్తం చేసిన కారణంగా ధ్రువీకరణ పత్రం ఇవ్వకపోవడంతో, ఈ విషయం మద్రాసు హైకోర్ట్‌కు చేరింది. కోర్టు జనవరి 9వ తేదీ ఉదయం తీర్పు వెల్లడిస్తామని తెలిపారు. దీని కారణంగా సినిమాను పూర్తిగా వాయిదా వేయాల్సి వచ్చింది.