Loading...
Jr NTR: జూనియర్‌ ఎన్టీఆర్‌ కొత్త అడుగు.. 'NTRTAIN' పేరుతో సొంత నిర్మాణ సంస్థ?
జూనియర్‌ ఎన్టీఆర్‌ కొత్త అడుగు.. 'NTRTAIN' పేరుతో సొంత నిర్మాణ సంస్థ?

Jr NTR: జూనియర్‌ ఎన్టీఆర్‌ కొత్త అడుగు.. 'NTRTAIN' పేరుతో సొంత నిర్మాణ సంస్థ?

వ్రాసిన వారు Moogati Shabari
Aug 19, 2026
10:30 am

ఈ వార్తాకథనం ఏంటి

మ్యాన్‌ ఆఫ్‌ మాసెస్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ సినీ కెరీర్‌లో మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. హీరోగా వరుస విజయాలను అందుకుంటూ పాన్‌ ఇండియా స్థాయిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తారక్‌.. ఇప్పుడు నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఇందులో భాగంగా తన సొంత ప్రొడక్షన్‌ హౌస్‌ను ఏర్పాటు చేసినట్లు సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. జూనియర్‌ ఎన్టీఆర్‌ కొత్త నిర్మాణ సంస్థకు 'NTRTAIN' అనే పేరు పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్‌ పేరులోని 'NTR'తో పాటు 'ENTERTAINMENT' అనే పదంలోని భావాన్ని కలిపి ఈ పేరును రూపొందించినట్లు తెలుస్తోంది. అంటే NTR + ENTERTAIN = NTRTAIN అనే విధంగా ప్రొడక్షన్‌ హౌస్‌కు నామకరణం చేసినట్లు సమాచారం.

వివరాలు

నిర్మాతగానూ తనదైన ముద్ర..

సినిమా, వినోదం అనే రెండు అంశాలను ప్రతిబింబించేలా ఈ పేరును రూపొందించినట్లు తెలుస్తోంది.

తన పేరుతో పాటు సినిమాలపై తనకున్న ఆసక్తి, అభిరుచిని కూడా ఈ బ్రాండ్‌ ద్వారా చాటే ఉద్దేశంతో తారక్‌ ఈ పేరును ఎంపిక చేసినట్లు టాక్‌ వినిపిస్తోంది.

ఈ నిర్మాణ సంస్థకు జూనియర్‌ ఎన్టీఆర్‌తో పాటు ఆయన సతీమణి ప్రణతి కూడా డైరెక్టర్లుగా వ్యవహరించనున్నట్లు సమాచారం.

అయితే దీనిపై అధికారికంగా పూర్తి వివరాలు ఇంకా వెల్లడికావాల్సి ఉంది. ఇప్పటికే నటుడిగా జూనియర్‌ ఎన్టీఆర్‌ దేశవ్యాప్తంగా భారీ క్రేజ్‌ సొంతం చేసుకున్నారు.

పాన్‌ ఇండియా సినిమాలతో తన మార్కెట్‌ను మరింత విస్తరించుకున్న ఆయన.. ఇక నిర్మాతగానూ తనదైన ముద్ర వేయబోతున్నారనే చర్చ ప్రస్తుతం టాలీవుడ్‌లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

వివరాలు

త్వరలో అధికారిక ప్రకటన..

అయితే 'NTRTAIN' బ్యానర్‌పై ఎలాంటి చిత్రాలను తెరకెక్కించబోతున్నారనే దానిపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది.

ఈ సంస్థ ద్వారా కేవలం జూనియర్‌ ఎన్టీఆర్‌ నటించే సినిమాలనే నిర్మిస్తారా? లేక విభిన్నమైన కథలను ఎంపిక చేసుకుని కొత్త దర్శకులు, యువ నటీనటులు, కొత్త ప్రతిభను ప్రోత్సహించే దిశగా సినిమాలను నిర్మిస్తారా? అనే ప్రశ్నలు అభిమానుల్లో మొదలయ్యాయి.

అదే విధంగా ఈ ప్రొడక్షన్‌ హౌస్‌ నుంచి వచ్చే తొలి ప్రాజెక్ట్‌ ఏమిటి? అది ఎప్పుడు ప్రారంభం కానుంది?

సినిమాకు సంబంధించిన ఇతర వివరాలను ఎప్పుడు వెల్లడిస్తారు? అనే అంశాలపై కూడా స్పష్టత రావాల్సి ఉంది.

ప్రస్తుతం 'NTRTAIN' నిర్మాణ సంస్థ గురించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

ADVERTISEMENT