రిలీజ్ కి ముందే సేఫ్ జోన్ లోకి ఎంటరైన కళ్యాణం కమనీయం?
సంక్రాంతి పండక్కి బాక్సాఫీసు వద్ద పెద్ద సినిమాల హవా నడుస్తుంటుంది. అందుకే చిన్న సినిమాలు ఆ టైమ్ లో దాదాపుగా రిలీజ్ అవ్వవు. కానీ శతమానం భవతి లాంటి సినిమాలు పెద్ద సినిమాల నడుమ రిలీజై దుమ్ము దులిపాయి. ఐతే ప్రస్తుతం తాజాగా ఒక సినిమా, రిలీజ్ కి ముందే సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోయిందని తెలుగు సినిమా సర్కిల్స్ లో మాటలు వినిపిస్తున్నాయి. సంతోష్ శోభన్ హీరోగా రూపొందిన కళ్యాణం కమనీయం చిత్రానికి శాటిలైట్, ఓటీటీ విభాగాల్లో మంచి వసూళ్ళు వచ్చాయని టాక్ వినిపిస్తోంది. సినిమాకు పెట్టిన బడ్జెట్ ఆల్ మోస్ట్ వచ్చేసినట్లే అని చెప్పుకుంటున్నారు. సినిమాను పరిమిత బడ్జెట్లో అందంగా తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది.
జనవరి 14వ తేదీన థియేటర్లలోకి వస్తున్న కళ్యాణం కమనీయం
సినిమాల్లోని పాటలు కూడా బాగున్నాయి. ఏ పనీ చేయని ఒక మగాడి జీవితంలో పెళ్ళి తర్వాత వచ్చిన మార్పులను ఈ సినిమాలో చూపించినట్లు అర్థం అవుతోంది. ట్రైలర్ కి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. దాంతో ఓటీటీ, శాటిలైట్ నుండి 7కోట్ల వరకూ వచ్చాయని, దాదాపుగా సినిమా బడ్జెట్ వచ్చేసినట్టే అని చెప్పుకుంటున్నారు. థియేటర్ నుండి వచ్చేదంతా బోనస్ అని, కళ్యాణం కమనీయం సినిమాకు అదృష్టం బాగా ఉందని, రిలీజ్ కి ముందే ఈ మాత్రం రావడం అద్భుతమని మాట్లాడుకుంటున్నారు. యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ లో రూపొందిన ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా కనిపిస్తుంది. ఈ సినిమాకు అనిల్ కుమార్ ఆళ్ళ దర్శకత్వం వహించారు.