Kamakshi Bhaskarla: ఇండస్ట్రీలో 'కమిట్‌మెంట్'పై కామాక్షి భాస్కర్ల షాకింగ్ కామెంట్స్..
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ హీరోయిన్ కామాక్షి భాస్కర్ల ఇండస్ట్రీలో కమిట్‌మెంట్, క్యాస్టింగ్ కౌచ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సినీ పరిశ్రమలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయా? అని ప్రశ్నించగా.. జరుగుతున్నాయని ఆమె స్పష్టం చేశారు. అయితే అవి ఎవరితో, ఎంతవరకు జరుగుతున్నాయనే విషయాన్ని తాను చెప్పలేనని, తనకు ఎదురైతే మాత్రం కచ్చితంగా చెప్పగలనని అన్నారు. ఈ క్రమంలో కొందరు నేరుగా అడగకుండా 'ఇంకేంటి? మరేంటి?' అంటూ ప్రశ్నిస్తారని ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
వివరాలు
కమిట్‌మెంట్‌పై కామాక్షి భాస్కర్ల కామెంట్స్
'మా ఊరి పొలిమేర' సినిమాలతో టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కామాక్షి భాస్కర్ల.. తాజాగా ఫిల్మీ ఫోకస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
ముఖ్యంగా ఇండస్ట్రీలో కమిట్‌మెంట్ అంశంపై ఆమె మాట్లాడుతూ.. "ఇండస్ట్రీలో ఇలాంటివి జరుగుతున్నాయా అంటే జరుగుతున్నాయి.
అయితే ఎంతవరకు, ఎవరితో జరుగుతున్నాయనేది నేను చెప్పలేను.
నాకు జరిగితే మాత్రం నేను చెప్పగలను" అని అన్నారు. సినీ పరిశ్రమలోకి డబ్బున్న ఎంతో మంది ఇన్వెస్టర్లు వస్తుంటారని కామాక్షి చెప్పారు.
వారిలో కొందరు తమను తాము ప్రొడ్యూసర్లుగా చెప్పుకుంటారని, డైరెక్టర్లుగా మారాలని కలలు కంటూ ఎంతో మంది వారి చుట్టూ తిరుగుతుంటారని తెలిపారు.
వివరాలు
వాళ్లంతా సోకాల్డ్ ప్రొడ్యూసర్లు
ఇలాంటి పరిస్థితులను కొందరు తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటారని అన్నారు.
ఇది కేవలం అమ్మాయిలకే పరిమితం కాదని, డైరెక్టర్లు కావాలనే ఉద్దేశంతో ఇండస్ట్రీలోకి వచ్చే అబ్బాయిలు కూడా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటారని కామాక్షి పేర్కొన్నారు.
కేవలం డబ్బు ఉన్నంత మాత్రాన ఎవరూ ప్రొడ్యూసర్లు అయిపోరని కామాక్షి భాస్కర్ల అభిప్రాయపడ్డారు.
ప్రొడక్షన్ అనేది ఒక క్రాఫ్ట్ అని ఆమె అన్నారు. రామానాయుడు, అల్లు అరవింద్, సురేష్, స్వప్న దత్ వంటి వారిని తాను నిజమైన ప్రొడ్యూసర్లుగా భావిస్తానని చెప్పారు.
వివరాలు
డాక్టర్ నుంచి నటిగా..
కామాక్షి భాస్కర్ల కేవలం నటి మాత్రమే కాదు.. ఆమె క్వాలిఫైడ్ ఎంబీబీఎస్ డాక్టర్ కూడా.
మెడిసిన్ పూర్తి చేసిన తర్వాత మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టిన ఆమె.. మిస్ తెలంగాణ టైటిల్‌ను గెలుచుకున్నారు.
ఆ తర్వాత నటనపై ఉన్న ఆసక్తితో సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు.
షార్ట్ ఫిలిమ్స్‌తో కెరీర్ ప్రారంభించిన కామాక్షికి 'మా ఊరి పొలిమేర' ఓటీటీ విడుదలతో మంచి గుర్తింపు వచ్చింది.
ఆ సినిమాలో ఆమె నటన, ఇంటెన్స్ ఎక్స్‌ప్రెషన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
అనంతరం థియేటర్లలో విడుదలైన 'మా ఊరి పొలిమేర 2' కూడా మంచి విజయాన్ని అందుకుంది.
ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.30 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించడంతో కామాక్షి కెరీర్ మరింత ఊపందుకుంది.