
KantaraChapter1 Day 1Collections : మొదటి రోజు 'కాంతార చాప్టర్ 1' వరల్డ్ వైడ్ డే -1 కలెక్షన్స్ ఎంతంటే?
ఈ వార్తాకథనం ఏంటి
కన్నడ సినిమా పరిశ్రమ నుంచి వచ్చిన మరో పాన్-ఇండియా ప్రాజెక్ట్ "కాంతార చాప్టర్-1" ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో రిషబ్ శెట్టి హీరోగా నటించడమే కాకుండా దర్శకుడిగా కూడా ఉన్నారు. ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ పాత్రలో కనిపించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబాలే భారీ బడ్జెట్‌తో ఈ సినిమా నిర్మాణాన్ని చేపట్టింది. కాంతార బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో దానికి ప్రీక్వెల్ గా వచ్చిన కాంతార చాప్టర్ 1భారీ అంచనాల ఏర్పడ్డాయి. ఎట్టకేలకు దసరా కానుకగా నిన్న వరల్డ్ వైడ్ గా రిలీజ్ ఆయింది.
వివరాలు
తొలి రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ( ఎస్టిమేట్ )చూస్తే..
ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్స్ తోనే ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ స్థాయిలో మంచి టాక్‌ను అందించాయి. అందుకు తగ్గట్టే తొలి రోజు ఈ సినిమా అదరగొట్టింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, థియేటర్స్ లో ఫస్ట్ షో, సెకండ్ షోలకు అదనపు షోలు ఏర్పాటు చేశారు. మొదటి రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్స్ (అంచనా ప్రకారం) చూస్తే... కర్ణాటక -రూ 20CR హిందీ -రూ. 22CR తెలుగు రాష్ట్రాలు -రూ. 10CR మలయాళం -రూ. 5CR తమిళ్ - రూ. 4CR ఇండియా నెట్ -రూ. 61CR ఇండియా గ్రాస్ - రూ. 72CR ప్రీమియర్స్ - రూ. 6CR ఓవర్సీస్ - రూ. 12CR ($1.35M) వరల్డ్ వైడ్ గ్రాస్ - రూ. 90CR