LOADING...
Dhanush: యాక్షన్‌ థ్రిల్లర్‌తో అలరించనున్న ధనుష్‌.. మే 28 నుంచి ఓటీటీలో 'కర' సందడి
యాక్షన్‌ థ్రిల్లర్‌తో అలరించనున్న ధనుష్‌.. మే 28 నుంచి ఓటీటీలో 'కర' సందడి

Dhanush: యాక్షన్‌ థ్రిల్లర్‌తో అలరించనున్న ధనుష్‌.. మే 28 నుంచి ఓటీటీలో 'కర' సందడి

వ్రాసిన వారు Moogati Shabari
May 23, 2026
11:49 am

ఈ వార్తాకథనం ఏంటి

కరా సినిమా ఇప్పుడు ఓటీటీలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ధనుష్, మమిత బైజు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రానికి డిజిటల్‌ విడుదల తేదీ ఖరారైంది. మే 28 నుంచి నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా స్ట్రీమింగ్‌ కానుంది. గత కొద్ది రోజులుగా ఓటీటీ విడుదలపై ప్రచారం సాగుతుండగా, తాజాగా నెట్‌ఫ్లిక్స్‌ అధికారికంగా విడుదల వివరాలను వెల్లడించింది. దర్శకుడు విఘ్నేష్ రాజా తెరకెక్కించిన ఈ చిత్రంలో కే.ఎస్.రవికుమార్, పృథ్విరాజన్ కీలక పాత్రలు పోషించారు.

వివరాలు

సినిమా కథ ఏంటంటే..

సినిమా కథ విషయానికి వస్తే.. కరస్వామి పాత్రలో కనిపించిన ధనుష్‌ ఒకప్పుడు దొంగతనాలు చేస్తూ జీవనం సాగిస్తుంటాడు. అయితే ప్రేమించి పెళ్లి చేసుకున్న మల్లి కోసం ఆ నేర ప్రపంచానికి దూరమై నిజాయితీగా జీవించాలని నిర్ణయించుకుంటాడు. భార్యతో కలిసి ఓ చిన్న హోటల్‌ ప్రారంభించాలని భావిస్తాడు. ఆ వ్యాపారం కోసం అవసరమైన డబ్బు సమకూర్చేందుకు గ్రామంలో ఉన్న తన భూమి పత్రాలను బ్యాంకులో తాకట్టు పెట్టాలని అనుకుంటాడు.

వివరాలు

పరిస్థితుల ఒత్తిడిలో హీరో ఏం చేస్తాడంటే..

అందుకోసం ఎన్నో సంవత్సరాల తర్వాత తన తండ్రిని కలుసుకోవడానికి ఇంటికి తిరిగి వెళ్తాడు. కానీ అనూహ్య పరిణామాల కారణంగా తన తండ్రిని కోల్పోతాడు. ఆ సంఘటన అతని జీవితాన్ని మళ్లీ మలుపుతిప్పుతుంది. పరిస్థితుల ఒత్తిడితో మరోసారి దొంగతనాల మార్గాన్ని ఎంచుకుంటాడు. ఈ క్రమంలో స్థానిక ప్రభావశాలి ముత్తు సెల్వన్‌కు చెందిన పంచవన్‌ యూనియన్‌ బ్యాంకులను లక్ష్యంగా చేసుకుని వరుస దోపిడీలు ప్రారంభిస్తాడు. అసలు కరస్వామి ఎవరు? అతను తన తండ్రికి ఎందుకు దూరంగా జీవించాడు? ముత్తు సెల్వన్‌ బ్యాంకులనే ఎందుకు టార్గెట్‌ చేశాడు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

Advertisement