Kayadu lohar: అలాంటి సినిమాల్ని ఎప్పటికీ అంగీకరించను : కయాదు లోహర్
ఈ వార్తాకథనం ఏంటి
సినిమాల్లో మహిళలను కేవలం వస్తువులుగా చూపించడాన్ని తాను అంగీకరించనని కథానాయిక కయాదు లోహర్ స్పష్టం చేసింది. కొత్తదనం ఉన్న కథలను ఎంచుకుంటూ దక్షిణాదిలో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న ఈ భామ.. ఈ ఏడాది ఇప్పటికే 'ఇదయం మురళి', 'ఐమ్ గేమ్', 'ఇమ్మోర్టల్' వంటి పలు చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న కయాదు.. సినిమాల్లో హీరోయిన్లను చూపించే విధానంపై తన అభిప్రాయాలను వెల్లడించింది.
వివరాలు
అలాంటి సినిమాలు చేయను..
"కేవలం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాలనే ఉద్దేశంతో నటీమణులను అసభ్యకరంగా చూపించే సినిమాల్లో నటించాలనుకోవడం లేదు.
మహిళలను అనవసరమైన వస్తువులా చూపించడం నాకు అస్సలు నచ్చదు.
అయితే కథకు, పాత్రకు అలాంటి సన్నివేశాలు అవసరమని నాకు నమ్మకం కలిగితే.. ఓ స్థాయి వరకు వాటిని అంగీకరిస్తాను.
అంతేకానీ కేవలం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించేందుకే అలాంటి వాటిని చేయడం నాకు ఇష్టం లేదు.
అలాంటి సన్నివేశాలు అప్పుడప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండ్ కావచ్చు. కానీ ఆ ఆలోచన నాకు ఏమాత్రం సౌకర్యవంతంగా అనిపించదు.
అందుకే అలాంటి సినిమాలను ఎప్పటికీ అంగీకరించను" అని కయాదు లోహర్ చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం కయాదు లోహర్ చేతిలో 'ది ప్యారడైజ్', 'సూర్య 48' తదితర చిత్రాలు ఉన్నాయి.