KBC 18 Bhushan Thakare: కేసీబీలో కోటి గెలిచిన కూలి కొడుకు.. ప్రశంసలు కురిపించిన అమితాబ్
ఈ వార్తాకథనం ఏంటి
కష్టాలు ఎంత పెద్దవైనా పట్టుదల ఉంటే గెలుపు దక్కుతుందనడానికి భూషణ్ థాకరే కథే ఉదాహరణ. అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న 'కౌన్ బనేగా కరోడ్‌పతి' 18వ సీజన్‌లో తొలి కోటీశ్వరుడిగా భూషణ్ నిలిచారు. ఒకప్పుడు తన బ్యాంకు ఖాతాలో కేవలం రూ.24 మాత్రమే ఉన్న ఈ యువకుడు ఇప్పుడు ఏకంగా రూ.1 కోటి గెలుచుకున్నారు. ఈ విజయం తనకు మాత్రమే కాదని, ఏళ్లుగా కుటుంబం ఎదుర్కొన్న ఆర్థిక కష్టాలకు ముగింపు పలికే అవకాశం అని భూషణ్ భావోద్వేగంతో చెప్పారు.
Details
అమితాబ్ ముందు కూర్చుని వణికిపోయా
కేబీసీ హాట్‌సీట్‌పై అమితాబ్ బచ్చన్ ఎదురుగా కూర్చున్న క్షణాలను భూషణ్ ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు.
మొదట ఆయనను చూడగానే తీవ్రంగా టెన్షన్‌కు గురై మాటలు కూడా సరిగ్గా రాలేదట.
పరిస్థితిని గమనించిన అమితాబ్ వెంటనే ప్రశ్నలతో ఒత్తిడి చేయకుండా కుటుంబం, వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడి భూషణ్‌ను కుదుటపడేలా చేశారు.
ఆ తర్వాతే ఆట మొదలైంది. అమితాబ్ ఇచ్చిన ఆ సహకారం లేకపోతే తెలిసిన సమాధానాల్లోనూ తప్పులు చేసేవాడినేమో అని భూషణ్ గుర్తుచేసుకున్నారు.
Details
కోటి గెలిచిన వెంటనే తల్లిదండ్రులే గుర్తొచ్చారు
రూ.1 కోటి గెలిచిన సమయంలో అమితాబ్ తనను ఆలింగనం చేసుకున్న క్షణం జీవితాంతం గుర్తుండిపోతుందని భూషణ్ చెప్పారు.
ముఖ్యంగా తన తల్లిదండ్రుల కష్టాలన్నీ ఇక తగ్గిపోతాయనే ఆలోచనే ఆ సమయంలో తనకు వచ్చిందన్నారు.
ఇకపై తన తండ్రితో రోజువారీ కూలి పని చేయించవద్దని, కుటుంబ బాధ్యతలను తానే తీసుకోవాలని అమితాబ్ సూచించారట.
ఈ మాటలను జీవితాంతం పాటిస్తానని భూషణ్ తెలిపారు. ప్రైజ్‌మనీతో ముందుగా తన తల్లి కోసం నగలు కొనాలని నిర్ణయించుకున్నారు.
Details
అమ్మ నగలు తిరిగి ఇవ్వాలన్న కోరిక
భూషణ్ జీవితంలో ఈ విజయం వెనుక తల్లి త్యాగం కూడా ఉంది. చదువుకు డబ్బు అవసరమైన ప్రతిసారీ తన తల్లి దాచుకున్న నగలను అమ్మేదని ఆయన చెప్పారు.
ఎన్నోసార్లు ఆ నగలను తానే తీసుకెళ్లి అమ్మానని గుర్తుచేసుకున్నారు. వాటిని తిరిగి తన తల్లికి ఇవ్వగలనా అనే బాధ ఎప్పుడూ ఉండేదన్నారు.
ఇప్పుడు కేబీసీ ఇచ్చిన అవకాశంతో ఆ కోరికను నెరవేర్చే స్థాయికి వచ్చానని ఆనందం వ్యక్తం చేశారు.
ఒకప్పుడు డబ్బు అడిగితే హేళన చేసిన బంధువులే ఇప్పుడు ఫోన్లు చేసి అభినందిస్తున్నారని చెప్పారు.
రూ.1 కోటి గెలిచిన తర్వాత రూ.7 కోట్ల ప్రశ్నను కూడా ఎదుర్కొన్నా.. కోటి గెలవడమే తన జీవితంలో అతిపెద్ద విజయమని భూషణ్ స్పష్టం చేశారు.