Varanasi: 'వారణాసి'పై కీరవాణి మ్యూజికల్ అప్‌డేట్.. మొత్తం ఎన్ని పాటలున్నాయంటే?
ఈ వార్తాకథనం ఏంటి
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా భారీ క్రేజ్‌ను సొంతం చేసుకున్న సినిమా 'వారణాసి'. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న ఈ యాక్షన్-అడ్వెంచర్ చిత్రం గురించి వచ్చే ప్రతి అప్డేట్ క్షణాల్లోనే వైరల్ అవుతోంది. తాజాగా అగ్ర సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంబంధించిన కీలక మ్యూజికల్ అప్‌డేట్‌ను పంచుకున్నారు. గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫి) వేడుకలకు హాజరైన కీరవాణి మాట్లాడుతూ, 'వారణాసి'లో సంగీతం ఎవరూ ఊహించని స్థాయిలో ఉండబోతుందని తెలిపారు. 'ప్రేక్షకులు ఈసినిమాలో అద్భుతమైన సంగీతాన్ని వినబోతున్నారు. ఇంతకుమించి ఇప్పుడు ఏ వివరాలూ చెప్పలేను. 'వారణాసి'లో మొత్తం ఆరు పాటలుంటాయి. మనం చేసే పనిపై స్పష్టత, మనపై నమ్మకం ఉంటే ఏదీ గందరగోళంగా అనిపించదు,
Details
యూట్యూబ్ లో 'రణ కుంభ' సాంగ్ ట్రెండింగ్
ఒత్తిడిగా కూడా ఉండదు. ఈ ప్రాజెక్ట్ విషయంలో నాకు ఎలాంటి సందిగ్ధత లేదని చెప్పారు. ఇప్పటికే విడుదలైన 'రణ కుంభ' ఆడియో సాంగ్ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో నిలుస్తూ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటోంది. రాజమౌళి-కీరవాణి కాంబినేషన్ అంటే ప్రత్యేకమైన అంచనాలే. 'స్టూడెంట్ నెం.1', 'యమదొంగ', 'మగధీర', 'ఈగ', 'బాహుబలి' చిత్రాల్లోని పాటలు ఇంతకీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇక 'ఆర్‌ఆర్‌ఆర్'లోని 'నాటు నాటు' పాటకు ఆస్కార్ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే.
Details
'వారణాసి' బడ్జెట్ ఎంత?
ప్రస్తుతం ఈ చిత్ర బడ్జెట్ విషయంలో సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. పలు భాషలకు చెందిన అగ్రతారలు నటిస్తున్న నేపథ్యంలో వీరికి భారీ పారితోషికం చెల్లించనుండటంతో సినిమా బడ్జెట్ భారీగా పెరిగిందని టాక్. ఈ ప్రాజెక్ట్ ఖర్చు ఏకంగా రూ.1100 కోట్లు వరకు ఉంటుందని వార్తలు వెలువడుతున్నాయి. 'వారణాసి' 2027 వేసవిలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.