Page Loader
Uppu Kappurambu : ఉప్పు కప్పురంబు కోసం సుహాస్‌తో కీర్తి సురేష్! 
Uppu Kappurambu : ఉప్పు కప్పురంబు కోసం సుహాస్‌తో కీర్తి సురేష్!

Uppu Kappurambu : ఉప్పు కప్పురంబు కోసం సుహాస్‌తో కీర్తి సురేష్! 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 20, 2024
12:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలుగు చిత్ర పరిశ్రమలో సోలో లీడ్‌గా రాణిస్తున్న యువ ప్రతిభావంతుల్లో సుహాస్ ఒకరు. ప్రసన్న వదనం, గొర్రె పురాణం, శ్రీరంగ నీతులు, ఆనందరావు సాహసాలు ప్రస్తుతం ఆయన చేస్తున్న చిత్రాలు. ప్రస్తుతం అయన హీరోగా ఐవి శశి దర్శకత్వంలో 'ఉప్పు కప్పురంబు' అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రం థియేట్రికల్ గా విడుదల చెయ్యకుండా నేరుగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ కి సంబంధించి ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ నటించనున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం కీర్తి తమిళంలో రఘుతాత,కన్నివేడి ,రివాల్వర్ రీటా వంటి చిత్రాలలో నటిస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సుహాస్‌తో కీర్తి సురేష్!