Anushka: అనుష్క 'ఘాటీ' మూవీపై కీలక అప్డేట్
ఈ వార్తాకథనం ఏంటి
అనుష్క శెట్టి తన ఫస్ట్ మూవీతోనే సరికొత్త గుర్తింపు తెచ్చుకుంది. 'అరుంధతి' సినిమాలో ఆమె చేసిన పాత్రతో మంచి పేరు పొందిన అనుష్క, 'బాహుబలి' సినిమా ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్‌ను సంపాదించుకుంది.
ప్రస్తుతం అనుష్క శెట్టి, దర్శకుడు క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్లో 'ఘాటి' అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలతో కలిసి నిర్మిస్తున్నారు.
వంశీకృష్ణా రెడ్డి, రాజీవ్ రెడ్డి ఈ చిత్రానికి నిర్మాతలుగా ఉన్నారు. ఈ చిత్రం లేడీ ఓరియెంటెండ్‌గా తెరకెక్కుతున్నట్టు తెలుస్తోంది. ఈ మూవీ ఏప్రిల్ 18న విడుదల కానుంది.
Details
85శాతం షూటింగ్ కంప్లీట్
ప్రస్తుతం ఈ సినిమా 85 శాతం షూటింగ్ పూర్తియైంది. పోస్ట్ ప్రొడక్షన్ కూడా మొదలైంది.
ఫిబ్రవరి మొదటి వారం నుంచి ఈ చిత్రంలోని క్లైమాక్స్‌ను షూట్ చేయడానికి అనుష్క సన్నాహాలు చేస్తున్నారు.
ఈ షూట్ అనంతరం డబ్బింగ్ కార్యక్రమాలు మొదలు కానున్నాయి.
ఇందులో అనుష్క తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పనున్నారు. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ చిత్రం థియేటర్‌లో విడుదలైన తర్వాత అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ కానుందని సమాచారం.