Kiara Advani: 'టాక్సిక్' కోసం రాత్రంతా డైలాగులు నేర్చుకున్నా: కియారా అద్వానీ
ఈ వార్తాకథనం ఏంటి
అందాల నటి కియారా అద్వానీ మాట్లాడుతూ, '''టాక్సిక్' సినిమాలో యాక్షన్, డ్రామా వంటి అంశాలు ఉన్నప్పటికీ, ఇందులో ప్రేమ, సంబంధాలను చూపించిన తీరు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది'' అని తెలిపింది. కియారా అద్వానీ కథానాయికగా, యష్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కియారా సినిమా విశేషాలను పంచుకుంది.
వివరాలు
రెండు భాషల్లో ఒకేసారి టాక్సిక్..
ఆమె మాట్లాడుతూ, '''టాక్సిక్' చిత్రాన్ని రెండు భాషల్లో ఒకేసారి తెరకెక్కించారు. అదే నాకు పెద్ద సవాలుగా మారింది. ఇంగ్లిష్, కన్నడ భాషల్లో సమాంతరంగా షూటింగ్‌లో పాల్గొనడం నా కెరీర్‌లో ఇదే మొదటిసారి. సాధారణంగా ముందుగా ఇంగ్లిష్‌లో సన్నివేశాన్ని చిత్రీకరించి, అనంతరం అదే సన్నివేశాన్ని కన్నడలో తెరకెక్కించేవాళ్లం. కన్నడ నా మాతృభాష కాకపోవడంతో సంభాషణలను సరిగ్గా నేర్చుకోవడానికి ఎక్కువ శ్రమ పెట్టాల్సి వచ్చింది.
వివరాలు
కియారా ఏం చెప్పిందంటే..
కొన్ని సందర్భాల్లో షూటింగ్‌కు ముందు రాత్రే నా డైలాగ్‌లను పదేపదే చదివి గుర్తుంచుకునేదాన్ని. అది నాకు హోంవర్క్ చేస్తున్న అనుభూతిని కలిగించింది. అప్పట్లో స్కూల్‌లో పాఠాలను కంఠస్థం చేసిన రోజులు గుర్తుకు వచ్చాయి. ఒక నటుడు లేదా నటి సెట్స్‌కు వెళ్లేలోపే తన సంభాషణలపై పూర్తి పట్టు సాధించాలి. ఎవరైనా నిద్రలోంచి లేపి డైలాగ్ అడిగినా వెంటనే చెప్పగలిగే స్థాయిలో అవి గుర్తుండాలి'' అని కియారా వెల్లడించింది.