LOADING...
Raj Kundra : కిడ్నీ దానం వివాదం.. ట్రోల్స్‌పై స్పందించిన శిల్పా శెట్టి భర్త రాజ్‌ కుంద్రా
కిడ్నీ దానం వివాదం.. ట్రోల్స్‌పై స్పందించిన శిల్పా శెట్టి భర్త రాజ్‌ కుంద్రా

Raj Kundra : కిడ్నీ దానం వివాదం.. ట్రోల్స్‌పై స్పందించిన శిల్పా శెట్టి భర్త రాజ్‌ కుంద్రా

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 16, 2025
02:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి భర్త, ప్రముఖ వ్యాపారవేత్త రాజ్‌ కుంద్రా ఇటీవల మథురలోని ఆధ్యాత్మిక గురువు ప్రేమానంద్‌ మహారాజ్‌ ఆశ్రమాన్ని సందర్శించారు. ఆ సమయంలో స్వామీజీ తనకు కిడ్నీ సమస్య ఉందని చెప్పగా, రాజ్‌ కుంద్రా స్పందిస్తూ, "మీరు ఒప్పుకుంటే నా కిడ్నీని దానంగా ఇస్తానని తెలిపారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో విస్తృతంగా వైరల్‌ అయ్యాయి. అయితే గతంలో పోర్న్‌ వీడియోల నిర్మాణం కేసులో అరెస్టైన రాజ్‌ కుంద్రా పేరు మళ్లీ తెరపైకి రావడంతో, నెటిజన్లు ఆయనను తీవ్రంగా ట్రోల్‌ చేశారు. ఈ కిడ్నీ దానం వ్యాఖ్యలు కూడా పబ్లిసిటీ కోసం చేశాడంటూ విమర్శలు గుప్పించారు. ఈ విమర్శలపై రాజ్‌ కుంద్రా తనదైన శైలిలో స్పందించారు.

Details

సోషల్ మీడియాలో మద్దతు

ప్రస్తుతం మనం ఎంత విచిత్రమైన ప్రపంచంలో జీవిస్తున్నామో గమనించండి. ఒకరు తమ శరీర భాగాన్ని మరొకరి ప్రాణాన్ని రక్షించడానికి దానం చేయాలనుకుంటే, దాన్ని పబ్లిసిటీ స్టంట్‌గా అభివర్ణిస్తున్నారు. మీ దృష్టిలో మంచితనం పీఆర్‌ స్టంట్‌ అయితే, ఈ ప్రపంచం అలాంటి పీఆర్‌ స్టంట్స్‌ను ఇంకా ఎక్కువగా చూడాలి. మానవత్వం ఒక వ్యూహం అయితే, దాన్ని మరింత మంది ఆచరించాలి. మీడియా కానీ ట్రోల్స్‌ కానీ నన్ను ప్రభావితం చేయలేవు. అవి నా వ్యక్తిత్వాన్ని మార్చలేవు. నేను ఎవరినీ ఆకట్టుకోవడానికి ఈ మాటలు చెప్పలేదు. దయచేసి ఇతరుల గురించి తక్కువగా మాట్లాడి, ఎక్కువ ప్రేమ పంచండి. మీరు కూడా ఒకరి ప్రాణాన్ని కాపాడగలరని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.