Loading...
Chennai Love Story: అమెరికాలో కిరణ్ అబ్బవరం జోరు.. 5 రోజుల్లో హాఫ్ మిలియన్ డాలర్ల క్లబ్‌లో 'చెన్నై లవ్ స్టోరీ'
అమెరికాలో కిరణ్ అబ్బవరం జోరు.. 5 రోజుల్లో హాఫ్ మిలియన్ డాలర్ల క్లబ్‌లో 'చెన్నై లవ్ స్టోరీ'

Chennai Love Story: అమెరికాలో కిరణ్ అబ్బవరం జోరు.. 5 రోజుల్లో హాఫ్ మిలియన్ డాలర్ల క్లబ్‌లో 'చెన్నై లవ్ స్టోరీ'

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 29, 2026
11:34 am

ఈ వార్తాకథనం ఏంటి

చిన్న సినిమాలు మంచి కంటెంట్‌తో బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయాలు సాధించడం కొత్త విషయం కాదు. కథ ప్రేక్షకుల హృదయాలను తాకితే దేశీయ మార్కెట్‌తో పాటు విదేశాల్లోనూ భారీ ఆదరణ లభిస్తుందని మరోసారి నిరూపిస్తోంది కిరణ్ అబ్బవరం నటించిన 'చెన్నై లవ్ స్టోరీ'. విడుదలైన తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్న ఈ రొమాంటిక్ ఎమోషనల్ డ్రామా ఇప్పుడు ఓవర్సీస్ మార్కెట్‌లోనూ బలమైన వసూళ్లతో దూసుకుపోతోంది.

వివరాలు

ఉత్తర అమెరికాలో హాఫ్ మిలియన్ డాలర్ల కలెక్షన్స్

రవి నంబూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మంచి వసూళ్లు నమోదు చేస్తోంది.

ఇప్పటికే రూ.50 కోట్ల గ్రాస్ దిశగా విజయవంతంగా పయనిస్తున్న ఈ మూవీ, ఉత్తర అమెరికాలో విడుదలైన కేవలం ఐదు రోజుల్లోనే 500,000 డాలర్ల వసూళ్లను దాటినట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.

కిరణ్ అబ్బవరం కెరీర్‌లోనే ఇది అత్యంత కీలకమైన ఓవర్సీస్ విజయాల్లో ఒకటిగా సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

వివరాలు

ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్న ఎమోషనల్ కథ

సాధారణంగా ప్రేమకథా చిత్రాలకు విదేశాల్లో తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది.

అయితే 'చెన్నై లవ్ స్టోరీ' కేవలం ప్రేమకథతో మాత్రమే కాకుండా, వివాహం తర్వాత దాంపత్య జీవితంలో ఎదురయ్యే భావోద్వేగాలను హృద్యంగా ఆవిష్కరించడంతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

అందుకే యువతతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ చిత్రానికి మంచి ఆదరణ చూపుతున్నారని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ADVERTISEMENT

వివరాలు

కిరణ్ - శ్రీ గౌరీ ప్రియ కెమిస్ట్రీ హైలెట్

ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం సరసన శ్రీ గౌరీ ప్రియ కథానాయికగా నటించింది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచిందని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు.

ఈ చిత్రాన్ని ఎస్.కె.ఎన్, సాయి రాజేష్ సంయుక్తంగా నిర్మించారు.

కథను కూడా సాయి రాజేష్ అందించగా, సంగీత దర్శకుడు మణిశర్మ స్వరపరిచిన పాటలు, నేపథ్య సంగీతం ప్రేక్షకుల నుంచి విశేష ప్రశంసలు అందుకుంటున్నాయి.

మరిన్ని రికార్డుల దిశగా 'చెన్నై లవ్ స్టోరీ'

ప్రస్తుతం విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శితమవుతున్న 'చెన్నై లవ్ స్టోరీ' రాబోయే రోజుల్లో దేశీయంగానే కాకుండా ఓవర్సీస్‌లోనూ మరిన్ని రికార్డులు నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ADVERTISEMENT