Loading...
KTR Review on the paradise: 'ది ప్యారడైజ్‌' చూసిన కేటీఆర్‌.. నాని, శ్రీకాంత్‌ ఓదెలపై ప్రశంసలు
'ది ప్యారడైజ్‌' చూసిన కేటీఆర్‌.. నాని, శ్రీకాంత్‌ ఓదెలపై ప్రశంసలు

KTR Review on the paradise: 'ది ప్యారడైజ్‌' చూసిన కేటీఆర్‌.. నాని, శ్రీకాంత్‌ ఓదెలపై ప్రశంసలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 27, 2026
09:54 am

ఈ వార్తాకథనం ఏంటి

నాని కథానాయకుడిగా శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడిక్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ 'ది ప్యారడైజ్‌' ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాను మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ శనివారం రాత్రి వీక్షించారు. హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌లోని సుదర్శన్‌ 35ఎంఎం థియేటర్‌లో కేటీఆర్‌ సినిమాను చూశారు. ఆయనతో పాటు రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు జగదీశ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి కలిసి సినిమాను వీక్షించారు. సినిమా చూసిన అనంతరం కేటీఆర్‌ ఎక్స్‌ వేదికగా తన స్పందనను వెల్లడించారు. అస్తిత్వం కోసం ఆరాటం, అణిచివేతపై పోరాటం. సందర్భం వస్తే గడ్డిపోచలు కూడా గడ్డపారలుగా మారుతాయనే సందేశాన్ని అందించిన తమ్ముడు శ్రీకాంత్‌ ఓదెలకు హృదయపూర్వక అభినందనలు.

వివరాలు

చిరునవ్వులు చిందించిన కేటీఆర్

కథానాయకుడి పాత్రలో జీవించిన మిత్రుడు నానికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. తమ్ముడు ప్రియదర్శికి ప్రత్యేక అభినందనలు. 'చావు నోట్లో తల పెట్టయినా.. మీకు గుర్తింపు తెస్తా!!' You know who that is ✊'' అని కేటీఆర్‌ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.

ఇదిలా ఉండగా.. 'ది ప్యారడైజ్‌'లో కేసీఆర్‌ను పోలిన ఎమ్మెల్యే శంకరన్న పాత్రకు సంబంధించిన సన్నివేశాలు తెరపై కనిపించిన సమయంలో థియేటర్‌లో ప్రేక్షకుల నుంచి అరుపులు, కేకలు వినిపించాయి.

ఈ సన్నివేశాలు వస్తున్నప్పుడు కేటీఆర్‌ చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు.

వివరాలు

తెలంగాణ భాషను అద్భుతంగా చూపించారు

సినిమా అనంతరం థియేటర్‌ బయట కేటీఆర్‌ మీడియాతో మాట్లాడారు.

ఒక సమాజంపై అణిచివేత జరిగినప్పుడు ఒక నాయకుడు ముందుకొచ్చి పోరాటం చేసి ఆ సమాజానికి గుర్తింపు తీసుకొచ్చిన కథకు సినిమాలో చక్కటి దృశ్య రూపం ఇచ్చారని అన్నారు.

తెలంగాణ, తెలంగాణ యాస, భాషను సినిమాలో తీర్చిదిద్దిన విధానం బాగుందని కేటీఆర్‌ ప్రశంసించారు.

ADVERTISEMENT