lokesh kanagaraj prabhas: నా చివరి సినిమా ప్రభాస్‌తోనే: లోకేష్ కనగరాజ్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బీజీగా ఉన్నాడు. సలార్, కల్కి 2898AD, మారుతీ మూవీ సినిమాలను ఏక కాలంలోనే తీస్తున్నాడు. ఈ సినిమాలు పూర్తియైన వెంటనే సందీప్‌రెడ్డి వంగతో స్పిరిట్, హనురాఘవపూడితో ఓ సినిమా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్ట్ ఉంది. తాజాగా ఈ జాబితాలోకి మరో స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కూడా జాయిన్ అయ్యారు. ఇండియన్ సినిమా చరిత్రలో హాలీవుడ్ తరహాలానే ఒక సినిమాటిక్ యూనివర్స్‌ను క్రియేట్ చేసిన ఘనత లోకేష్ కనగరాజ్‌కే దక్కుతుంది. ఒక్క మాస్టర్ సినిమా మినహాయించి మిగిలిన మూడు సినిమాలు LCUలోనివే. ప్రస్తుతం రిలీజ్‌కు సిద్ధంగా ఉన్న లియో కూడా LCU భాగంగా తెరకెక్కిందని టాక్ నడుస్తోంది.
ఆనందంలో మునిగిపోయిన ప్రభాస్ ఫ్యాన్స్
తన జీవితంలో కేవలం 10 సినిమాలను మాత్రమే చేస్తానని, ఆ తర్వాత మెగా ఫోన్ పక్కన పెట్టేసి ప్రొడ్యూసర్‌గా, రైటర్‌గా ఫిక్స్ అయిపోతానని లోకేష్ కనగరాజ్ పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చాడు. తాజాగా లోకేష్ లియో ప్రమోషన్‌లో భాగంగా తన నెక్ట్స్ లైనప్ గురించి పలు అసక్తికర విషయాలను వెల్లడించారు. అందులో ప్రభాస్‌తో ఓ సినిమాను చేస్తున్నట్లు ప్రకటించాడు. తన చివరి సినిమా ప్రభాస్‌తోనే ఉంటుందని చెప్పారు. చివరి సినిమాను ప్రభాస్‌తో ముగిస్తాడని తెలియడంతో ఫ్యాన్స్ అప్పుడే ఊహల్లో మునిగిపోతున్నారు. ఈ చివరి సినిమాపై ఫ్యాన్స్ భారీ అంచనాలనే పెట్టుకున్నారు.