this week telugu movies: నవంబర్ లాస్ట్ వీక్.. ఈ వారం థియేటర్, ఓటీటీలో రిలీజయ్యే ముఖ్య చిత్రాలివే!
ఈ వార్తాకథనం ఏంటి
రామ్ పోతినేని ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'ఆంధ్ర కింగ్ తాలూకా' త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించిన ఈ సినిమాను పి. మహేశ్‌బాబు దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రంలో ఉపేంద్ర ముఖ్య పాత్ర పోషించారు. హృదయాన్ని హత్తుకునే కథ, గాఢమైన భావోద్వేగాలు, రామ్ మార్క్ హాస్యంతో రూపొందిన ఈ చిత్రం నవంబర్ 27న థియేటర్లలో విడుదల కానుంది.
Details
తన
ధనుష్ కథానాయకుడిగా ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహించిన రొమాంటిక్ డ్రామా 'తేరే ఇష్క్ మేన్' (Tere Ishk Mein) హిందీతో పాటు తెలుగులో 'అమర కావ్యం' పేరుతో విడుదలవుతోంది. కృతి సనన్ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించడం విశేషం. ఈ చిత్రం కూడా నవంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Details
ఈ వారం థియేటర్లలో విడుదలయ్యే మరిన్ని చిత్రాలు
స్కూల్ లైఫ్ చిత్రం: స్కూల్‌లైఫ్ నటీనటులు: పులివెందుల మహేశ్, షన్ను, సావిత్రి, సుమన్ తదితరులు దర్శకత్వం: పులివెందుల మహేశ్ * విడుదల: 28-11-2025 జనతా బార్ నటీనటులు: రాయ్ లక్ష్మీ, అమన్ ప్రీత్ సింగ్, దీక్షాపంత్, శక్తికపూర్, అనూప్ సోని, ప్రదీప్ రావత్ తదితరులు దర్శకత్వం: అశ్వర్థ నారాయణ విడుదల: 28-11-2025 మరువ తారమా నటీనటులు: హరీశ్ ధనుంజయ, అతుల్య చంద్ర, అవంతిక హరి నల్వాల దర్శకత్వం: చైతన్య వర్మ విడుదల: 28-11-2025 బిజినెస్‌మ్యాన్ (రీ రిలీజ్) నటీనటులు: మహేశ్‌బాబు, కాజల్ అగర్వాల్, నాజర్, ప్రకాశ్‌రాజ్ దర్శకత్వం: పూరి జగన్నాథ్ రీ-రిలీజ్: 28-11-2025
Details
ఈ వారం ఓటీటీలో అలరించనున్న కొత్త చిత్రాలు / వెబ్‌సిరీస్‌లు
నెట్‌ఫ్లిక్స్ జింగిల్ బెల్ హీస్ట్ (హాలీవుడ్) - నవంబర్ 26 స్టైజర్ తింగ్స్ 4 (వెబ్‌సిరీస్ - కొత్త సీజన్) - నవంబర్ 26 అమెజాన్ ప్రైమ్ వీడియో గుడ్ స్పోర్ట్స్ (వెబ్‌సిరీస్) - నవంబర్ 25 బార్న్ హంగ్రీ (మూవీ) - నవంబర్ 28