
గాండీవధారి అర్జున నుండి తాజా అప్డేట్: థియేటర్లు దద్దరిల్లడానికి చెమటలు కారుస్తున్న వరుణ్ తేజ్
ఈ వార్తాకథనం ఏంటి
మెగా హీరో వరుణ్ తేజ్ చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి ఎయిర్ పోర్స్ డిపార్ట్ మెంటుకు సంబంధించిన కథ అయితే మరోటి ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ గాండీవధారి అర్జున.
ఈ రెండు చిత్రాల షూటింగులు జరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం గాండీవధారి అర్జున షూటింగ్ కోసం వరుణ్ తేజ్ ప్రిపేర్ అవుతున్నాడు.
బుడాపెస్ట్ లో జరగబోయే హై వోల్టేజ్ యాక్షన్ సీన్ల కోసం వరుణ్ తేజ్ ప్రాక్టీసు చేస్తున్నాడు.
వరుణ్ తేజ్ ప్రాక్టీసు ఫోటోలను ట్విట్టర్ ద్వారా షేర్ చేసిన చిత్ర నిర్మాణ సంస్థ, థియేటర్లు దద్దరిల్లడానికి వరుణ్ తేజ్ చెమటలు కారుస్తున్నాడని కామెంట్ చేసింది.
Details
ఏజెంట్ భామ హీరోయిన్ గా తెరకెక్కుతోన్న చిత్రం
ద ఘోస్ట్ చిత్రం తర్వాత ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇదే. గతంలో ఎల్బీడబ్ల్యూ, గుంటూరు టాకీస్, చందమామ కథలు, పీఎస్ గరుడవేగ చిత్రాలను డైరెక్ట్ చేసాడు ప్రవీణ్ సత్తారు.
ఏజెంట్ సినిమాలో అక్కినేని అఖిల్ సరసన నటించిన సాక్షి వైద్య, గాండీవధారి అర్జున సినిమాలో హీరోయిన్ గా మెరుస్తోంది.
మిక్కీ జే మేయర్ స్వరాలు అందిస్తున్న ఈ సినిమాను, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ లో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.
గని సినిమాతో అపజయాన్ని వెనకేసుకున్న వరుణ్ తేజ్, గాండీవధారి అర్జున సినిమాతో మళ్ళీ విజయాల బాట పడతాడేమో వేచి చూడాలి. ఈ సినిమా విడుదల తేదీని ఇంకా ప్రకటించలేదు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ప్రాక్టీసు చేస్తున్న వరుణ్ తేజ్
Sweating it out to set the screens ablaze 🔥
— SVCC (@SVCCofficial) May 3, 2023
Mega Prince @IAmVarunTej is prepping for a high-octane action sequence of #GandeevadhariArjuna, that is to be shot in Budapest soon💥💥@sakshivaidya99 @PraveenSattaru @MickeyJMeyer @BvsnP @SVCCofficial @jungleemusicSTH pic.twitter.com/SE4J9uUw0R