LOADING...
Singer B Praak: రూ.10 కోట్లు ఇవ్వకపోతే చంపేస్తాం.. బీ ప్రాక్‌కు లారెన్స్ గ్యాంగ్ బెదిరింపు కాల్స్
రూ.10 కోట్లు ఇవ్వకపోతే చంపేస్తాం.. బీ ప్రాక్‌కు లారెన్స్ గ్యాంగ్ బెదిరింపు కాల్స్

Singer B Praak: రూ.10 కోట్లు ఇవ్వకపోతే చంపేస్తాం.. బీ ప్రాక్‌కు లారెన్స్ గ్యాంగ్ బెదిరింపు కాల్స్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 17, 2026
10:34 am

ఈ వార్తాకథనం ఏంటి

భారతీయ ప్రముఖ గాయకుడు బీ ప్రాక్‌ అలియాస్‌ ప్రతీక్‌ బచన్‌కు లారెన్స్‌ గ్యాంగ్‌ నుంచి హత్యా బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. రూ.10 కోట్లు ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరించినట్లు సమాచారం. బెదిరించిన వ్యక్తి తనను అర్జు బిష్ణోయ్‌గా పరిచయం చేసుకున్నాడు. జనవరి 6న మధ్యాహ్నం బీ ప్రాక్‌కు ఓ ఆడియో రికార్డింగ్‌ అందింది. ఆ ఆడియోకు ముందు రెండు సార్లు ఫోన్‌ కాల్స్‌ వచ్చినప్పటికీ ఆయన స్పందించలేదు. అదే రోజు మరో విదేశీ నంబర్‌ నుంచి కాల్‌ రావడంతో అనుమానం వచ్చిన గాయకుడు వెంటనే మొహాలి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. ఆ ఆడియోలో రూ.10 కోట్లు చెల్లించాలని, లేదంటే చంపేస్తామని స్పష్టంగా బెదిరించారు.

Details

ఎవరినైనా కలిస్తే వారిని కూడా హతమారుస్తాం

అంతేకాదు, ఏ దేశానికి వెళ్లినా తమ నుంచి తప్పించుకోలేరని, అతనితో ఎవరైనా కలిసి కనిపిస్తే వారిని కూడా హతమారుస్తామని హెచ్చరించారు. ఇది నకిలీ కాల్‌ అని భావించవద్దని కూడా ఆ వ్యక్తి హెచ్చరించినట్లు సమాచారం. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బెదిరింపుల వెనుక ఉన్న నెట్‌వర్క్‌, కాల్స్‌ వచ్చిన నంబర్లు, ఆడియో వివరాలపై విచారణ కొనసాగిస్తున్నారు. బీ ప్రాక్‌ అలియాస్‌ ప్రతీక్‌ బచన్‌ పంజాబీతో పాటు హిందీ సంగీత పరిశ్రమలో ప్రముఖుడు. సంగీత నిర్మాతగా కెరీర్‌ను ప్రారంభించిన ఆయన, తరువాత సంగీత దర్శకుడు, స్వరకర్తగా గుర్తింపు పొందారు. 'మన్‌ భార్య' పాటతో గాయకుడిగా అరంగ్రేటం చేసి దేశవ్యాప్తంగా విశేషమైన అభిమానాన్ని సంపాదించుకున్నారు.

Advertisement