
Pranayam OTT Release Date: 70 ఏళ్ళ వయసులో ప్రేమ పెళ్లి.. ఆహాలో కొత్త ప్రయోగాత్మక సినిమా!
ఈ వార్తాకథనం ఏంటి
తెలుగు ఓటిటి ప్లాట్‌ఫార్మ్ ఆహాలో తాజాగా మరో వినూత్నమైన చిత్రం స్ట్రీమింగ్ మొదలైంది.
ఈ సినిమా పేరు 'ప్రణయం' (Pranayam). టైటిల్ వినగానే కొత్తగా అనిపిస్తోంది కదా? అదేలా కథ కూడా కొంచెం భిన్నంగానే ఉంటుంది.
మలయాళంలో రూపొందిన ఈ సినిమాను, తెలుగు ప్రేక్షకుల కోసం డబ్బింగ్ చేసి విడుదల చేసింది ఆహా.
ఈ సినిమా అసలు పేరు 'జననం: 1947 ప్రణయం తుడరన్ను' . ప్రధాన పాత్రల్లో జయరాజ్ కోజికోడ్, లీలా శాంసన్ నటించగా, అభిజిత్ అశోకన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
మార్చి 15న ఈ సినిమా మలయాళంలో థియేటర్లలో విడుదలై విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది.
ఇప్పుడు తెలుగు డబ్బింగ్ రూపంలో ఏప్రిల్ 23 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది.
Details
70 ఏళ్ల వయసులో ప్రేమ... పెళ్లి
ఈ కథలో అశోక్ శివన్ అనే వృద్ధుడు (జయరాజ్ కోజికోడ్) ఓ వృద్ధాశ్రమంలో ఉద్యోగిగా పని చేస్తుంటాడు. అక్కడే గౌరీ అనే రిటైర్డ్ స్కూల్ టీచర్ (లీలా శాంసన్) కూడా ఉంటారు.
ఈ ఇద్దరూ వృద్ధాశ్రమంలో సన్నిహితంగా ఉండటంతో పరిచయం ప్రేమగా మారుతుంది.
వారి ప్రేమ పెళ్లి వరకు దారి తీస్తుంది. 70 ఏళ్ల వయసులో ప్రేమ, వివాహం అనే వినూత్న కాన్సెప్ట్‌ను ఈ సినిమా చూపిస్తుంది.
తరువాత వారి జీవితంలో ఏం జరిగింది అనేది మాత్రం సినిమా చూశాకే తెలుస్తుంది.
Details
నటీనటులు, స్ట్రీమింగ్ వివరాలు
ఈ సినిమాలో అను సితార, నుబీ మార్కోస్, ఇర్షద్ అలీ, దీపక్ పరంబోల్, కృష్ణ ప్రభ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఇక ఈ సినిమా ఒరిజినల్ మలయాళ వెర్షన్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఏప్రిల్ 14 నుంచి అందుబాటులో ఉంది. కానీ తెలుగు డబ్బింగ్ వర్షన్ మాత్రం ఇప్పుడు ఆహాలో ప్రత్యేకంగా విడుదలైంది.
వృద్ధుల ప్రేమ కథలు చాలా అరుదుగా చూసే అవకాశం కలిగే ఈ చిత్రాన్ని మీరు తప్పకుండా చూడవచ్చు.
అభిరుచికి భిన్నంగా ఏదైనా కోరే ప్రేక్షకుల కోసం ఇది మంచి ఎమోషనల్ రైడ్ అవుతుంది.