LOADING...
Globetrotter Event: యూట్యూబ్‌లోకి 'గ్లోబ్‌ట్రాటర్‌' ఈవెంట్
యూట్యూబ్‌లోకి 'గ్లోబ్‌ట్రాటర్‌' ఈవెంట్

Globetrotter Event: యూట్యూబ్‌లోకి 'గ్లోబ్‌ట్రాటర్‌' ఈవెంట్

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 19, 2025
12:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

దర్శకుడు రాజమౌళి-మహేష్ బాబు కాంబినేషన్‌లో రూపొందుతున్న తాజా ప్రాజెక్ట్ 'వారణాసి'. ఇటీవల రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించిన 'గ్లోబ్‌ట్రాటర్' అనే ప్రత్యేక కార్యక్రమం ఈ సినిమా ప్రమోషన్లలో భాగమనే విషయం తెలిసిందే. మొదట ఈ ఈవెంట్‌ను జియోహాట్‌స్టార్ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో మాత్రమే ప్రసారం చేశారు. ఇక తాజాగా, ఆ వేడుక మొత్తం వీడియోను టీం యూట్యూబ్‌లో రిలీజ్ చేసింది. సుమారు గంటా 37 నిమిషాల నిడివితో ఉన్న ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్‌ఫార్మ్లలో జోరుగా ట్రెండ్ అవుతోంది. మీరూ ఆసక్తిగా ఉంటే, ఆ పూర్తి వీడియోను వెంటనే చూడొచ్చు.