
Ram-Double ismart: రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్ ఫోజ్...అభిమానుల్లో జోష్
ఈ వార్తాకథనం ఏంటి
డబుల్ ఇస్మార్ట్ సినిమాకు సంబంధించి మేకర్స్ మంచి అప్డేట్ ఇచ్చారు.
ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మాస్ ఫాలోయింగ్ పెంచుకున్న రామ్ పోతినేని ఇప్పుడు తన మార్కెట్ ను మరింత పెంచుకునే దశగా అడుగులు వేస్తున్నారు.
ఇందులో భాగంగానే ఇస్మార్ట్ శంకర్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో డబుల్ ఇస్మార్ట్ సినిమాను ప్రారంభించారు.
అయితే ఈ సినిమా షూటింగ్ మొదలై అని వారి కారణాలవల్ల ఆగిపోయింది .
ఈ సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైనట్లు తెలుస్తోంది. సినిమాకు సంబంధించి కొన్ని కీలక సన్నివేశాలను ఫిలిం యూనిట్ చిత్రీకరించినట్లు సమాచారం.
తాజాగా రామ్ పోతినేని స్టిల్ ను ఎక్స్ ద్వారా విడుదల చేసి ఆడియన్స్ లో జోష్ పెంచారు.
Ram-Double ismart:
విలన్ గా సంజయ్ దత్ ...మణిశర్మ సంగీతం
ఈ సినిమాలో బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నారు.
ఈ సినిమా విడుదల కావాల్సి ఉన్నప్పటికీ అనివార్య కారణాల వల్ల షూటింగ్ డిలే అయింది.
రామ్ పోతినేని కి హీరోయిన్ గా కావ్య థాపర్ నటిస్తున్నారు.
ఈ చిత్రానికి మణిశర్మ స్వరాలు సమకూరుస్తున్నారు.
పూరీ కనెక్ట్స్ బ్యానర్ పై ,పూరి జగన్నాథ్, చార్మికౌర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
పూరీ కనెక్ట్స్ నుంచి విడుదల చేసిన డబుల్ ఇస్మార్ట్ స్టిల్
Dhin thalli diMAKIKIRIKIRI aithandhi🧠
— Puri Connects (@PuriConnects) May 11, 2024
Edho Vacchelane undhi 👀#DoubleISMART pic.twitter.com/ZmO9h3sDj6