LOADING...
Chiranjeevi : ఫైనల్ షెడ్యూల్‌లోకి 'మన శంకర్ వరప్రసాద్ గారు'.. షూటింగ్ స్పీడ్ పెంచిన టీమ్ 
ఫైనల్ షెడ్యూల్‌లోకి 'మన శంకర్ వరప్రసాద్ గారు'.. షూటింగ్ స్పీడ్ పెంచిన టీమ్

Chiranjeevi : ఫైనల్ షెడ్యూల్‌లోకి 'మన శంకర్ వరప్రసాద్ గారు'.. షూటింగ్ స్పీడ్ పెంచిన టీమ్ 

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 07, 2025
09:13 am

ఈ వార్తాకథనం ఏంటి

మెగాస్టార్ చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందుతున్న ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్ 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రంపై షూటింగ్, నిర్మాణ కార్యక్రమాలు వేగంగా సాగుతున్నాయి. నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ ప్రాజెక్టులో మరో స్టార్ హీరో వెంకటేష్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నాడు. తాజా సమాచారం ప్రకారం, దర్శకుడు అనిల్ రావిపూడి వచ్చే వారం నుంచి సినిమా క్లైమాక్స్‌కు సంబంధించిన ప్యాచ్‌వర్క్ షూట్‌ను ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ఈ ముఖ్యమైన షూట్‌లో మెగాస్టార్ చిరంజీవితో పాటు ప్రధాన తారాగణం మొత్తం పాల్గొననుంది. ఇదిలాఉండగా, చిత్ర బృందం ఇప్పటికే పోస్ట్-ప్రొడక్షన్ పనులను వేగవంతం చేస్తూ, సినిమాను వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తోంది.

Details

ఈ మూవీపై భారీ అంచనాలు

ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌పై చిరంజీవికి భారీ నమ్మకం ఉంది. గతంలో ఆయన మాట్లాడుతూ, 'మన శంకర వరప్రసాద్ గారు' పూర్తిస్థాయి వినోదాత్మక కథతో సాగుతుందని, స్క్రిప్ట్ తనను అంతగా అలరించిందని తెలిపారు. ముఖ్యంగా అనిల్ రావిపూడి సన్నివేశాలు వివరించే సమయంలో తాను కడుపుబ్బా నవ్వుకున్నానని, ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందని మెగాస్టార్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ చిత్రాన్ని సాహు గారపాటి, చిరంజీవి కుమార్తె సుస్మిత సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన అప్‌డేట్స్‌తో అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌పై భారీ అంచనాలేర్పడ్డాయి

Advertisement