LOADING...
Sasirekha Second Single: 'మన శంకరవర ప్రసాద్' నుంచి సెకండ్ సింగిల్ ప్రకటన!
'మన శంకరవర ప్రసాద్' నుంచి సెకండ్ సింగిల్ ప్రకటన!

Sasirekha Second Single: 'మన శంకరవర ప్రసాద్' నుంచి సెకండ్ సింగిల్ ప్రకటన!

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 04, 2025
11:21 am

ఈ వార్తాకథనం ఏంటి

అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న "మన శంకరవర ప్రసాద్" (MSG) సినిమా నుంచి రెండో పాట విడుదల తేదీ ఖరారైంది. ఇప్పటికే విడుదలైన తొలి పాట "మీసాల పిల్ల" సూపర్ హిట్‌గా నిలిచి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుండటంతో, చిత్రబృందం తాజా మ్యూజిక్ అప్‌డేట్‌తో అభిమానుల్లో మరింత ఉత్సాహం పెంచింది. "శశిరేఖ" (Sasirekha) అనే శీర్షికతో విడుదల కాబోతున్న ఈ రెండో పాట డిసెంబర్ 08న ప్రేక్షకుల ముందుకు రానుంది.

వివరాలు 

పాటకు సంబంధించిన ప్రోమోను డిసెంబర్ 6న విడుదల

ఈ పాటకు సంబంధించిన ప్రోమోను డిసెంబర్ 6న విడుదల చేయనున్నట్లు బృందం అధికారికంగా వెల్లడించింది. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తుండగా, మెగాస్టార్ చిరంజీవితో పాటు విక్టరీ వెంకటేష్,నయనతార, కేథరిన్ థ్రెసా వంటి ప్రముఖ నటీనటులు ముఖ్య పాత్రల్లో కనిపిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని సాహు గారపాటి, సుష్మిత కొణిదెల, వి. హరికృష్ణ (షైన్ స్క్రీన్స్) సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నిర్మాణ సంస్థ చేసిన ట్వీట్ 

Advertisement