Manchu Lakshmi : బొడ్డు కనిపిస్తే తప్పేంటి? టాలీవుడ్ కల్చర్‌పై మంచు లక్ష్మి హాట్ కామోంట్స్..
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ నటి, నిర్మాత మంచు లక్ష్మీ ఇటీవల 'ది మేల్ ఫెమినిస్ట్' పేరుతో వెలువడే పాపులర్ పోడ్‌కాస్ట్‌లో పాల్గొని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. తన వ్యక్తిగత ప్రయాణం, సినీ పరిశ్రమలో ఎదురైన అనుభవాలు, మహిళలు రోజూవారీగా ఎదుర్కొనే సామాజిక ఒత్తిళ్లు వంటి అనేక కీలక విషయాలను ఆమె అన్‌ఫిల్టర్డ్‌గా వెల్లడించింది. మీటూ ఉద్యమంపై మాట్లాడిన సందర్భంగా, తాను కూడా ఇండస్ట్రీలో కొన్ని చేదు అనుభవాలను ఎదుర్కొన్నానని తెలిపింది. "స్టార్ కిడ్‌గా వచ్చిన నేను సమస్యలు ఏమి ఎదుర్కోలేదనుకోవడం పెద్ద పొరపాటు. కొన్ని సంఘటనలు విన్నప్పుడల్లా రాత్రిళ్లు ఏడ్చేదాన్ని" అని భావోద్వేగంతో చెప్పిన ఆమె మాటలు మహిళలు పరిశ్రమలో పడే కష్టాలను ప్రతిబింబించేలా ఉన్నాయి.
వివరాలు
అది ఆర్ట్‌లో భాగం
ఫిల్మ్ కల్చర్ విషయానికి వస్తే, దక్షిణాది-ఉత్తరాదిలోని సినీ పరిశ్రమలు ఎలా భిన్నంగా ఉంటాయో మంచు లక్ష్మీ స్పష్టంగా వివరించింది. డ్రెస్‌పై వచ్చే విమర్శల గురించి మాట్లాడుతూ, "ఒక సీన్‌కి కావాలంటే కొంచెం బొడ్డు కనిపించొచ్చు. దాంట్లో తప్పేదుంది? అది ఆర్ట్‌లో భాగం, పాత్ర అవసరం.కానీ మన సమాజం మాత్రం మహిళల శరీరాన్ని అర్థం కాకుండా విమర్శించే వైఖరి చూపుతుంది"అని ఆమె గట్టిగా వ్యాఖ్యానించింది. సౌత్‌లో సంప్రదాయ పేరుతో ఉన్న ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని,నార్త్ ఇండస్ట్రీ ప్రొఫెషనల్‌గా వ్యవహరిస్తుందని కూడా వ్యాఖ్యానించింది. కాస్మెటిక్ సర్జరీ పై వచ్చిన విమర్శలను కూడా లక్ష్మీ తిప్పికొట్టింది "ఎవరైనా సర్జరీ చేయించుకోవాలంటే అది వారి వ్యక్తిగత నిర్ణయం.మహిళలు మాట్లాడటానికే భయపడే సమాజాన్ని మార్చాల్సిన సమయం వచ్చింది" అని తెలిపింది.
వివరాలు
సోషల్ మీడియాలో పెద్ద చర్చకు కారణమవుతున్న అన్‌ఫిల్టర్డ్ వ్యాఖ్యలు
హాలీవుడ్‌లో పని చేసిన అనుభవాన్ని గుర్తుచేసుకుంటూ, అక్కడి వర్క్ కల్చర్, గౌరవం, టైమ్ మేనేజ్‌మెంట్ వంటి విషయాలు టాలీవుడ్‌తో పోలిస్తే ఎంతో మెరుగ్గా ఉంటాయని చెప్పింది. సెక్స్ ఎడ్యుకేషన్ విషయంలో కూడా ఆమె అభిప్రాయాలు వెల్లడిస్తూ, అమెరికాలో చిన్న వయసులోనే దీనికి ప్రాధాన్యం ఇస్తారని, అయితే భారతదేశంలో మాత్రం ఈ విషయంపై మాట్లాడటమే తప్పుగా భావించే పరిస్థితి ఉందని చెప్పింది. మొత్తంగా, మంచు లక్ష్మీ చెప్పిన ప్రతీ అంశం సినీ పరిశ్రమలో ఉన్న వాస్తవాలు, సమాజంలో ఇంకా కొనసాగుతున్న పాత మనోభావాలు, మహిళలు ఎదుర్కొనే అనేక సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చింది. ఆమె చెప్పిన అన్‌ఫిల్టర్డ్ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు కారణమవుతున్నాయి.