
Mohan Babu University: మోహన్‌బాబు యూనివర్సిటీ జరిమానా వివాదంపై మంచు విష్ణు క్లారిటీ
ఈ వార్తాకథనం ఏంటి
మోహన్ బాబు ప్రైవేటు విశ్వవిద్యాలయం (Mohan Babu University) పై ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ (APHERMC)చర్యలకు సంబంధించిన వివాదంపై యూనివర్సిటీ ప్రో-ఛాన్సలర్ మంచు విష్ణు (Manchu Vishnu) స్పష్టమైన ప్రకటన విడుదల చేశారు. కమిషన్ విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేయడం, ఆదాయాన్ని వెల్లడించకపోవడం, హాజరు నిర్వహణలో లోపాలు, ఒరిజినల్ సర్టిఫికెట్లను నిలిపివేయడం వంటి అంశాలపై రూ.15 లక్షల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. అంతేకాదు, అదనంగా వసూలు చేసిన రూ.26,17,52,872ను తిరిగి చెల్లించాలని ఆదేశించింది. ఈ వివరాలు కమిషన్ తన వెబ్‌సైట్‌లో కూడా ఉంచింది. ఇది చూసి సోషల్ మీడియా, వార్తాపత్రికల్లో వివిధ నిరాధార కథనాలు పాఠకుల వరకు చేరడం మోహన్‌బాబు విశ్వవిద్యాలయం గమనించింది.
Details
నిరాధార వార్తలను నమ్మకండి
అందుకు ప్రతిస్పందిస్తూ, మంచు విష్ణు తెలిపినట్లే 'మాధ్యమాలలో ప్రచారమవుతున్న వార్తలు ఉద్దేశపూర్వకంగా, నిరాధారంగా ఉన్నాయని నమ్మరాదని, ఈవ్యవహారం ప్రస్తుతం హైకోర్టులో విచారణలో ఉందని తెలిపారు. విశ్వవిద్యాలయం ఈ సిఫార్సులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు, అవి కేవలం కమిషన్ సిఫార్సులు మాత్రమే అని, హైకోర్టు ఇప్పటికే విశ్వవిద్యాలయానికి అనుకూలంగా 'స్టే' ఉత్తర్వు జారీ చేసిందని తెలిపారు. 'కోర్టు ఉత్తర్వును ధిక్కరించి సమాచారాన్ని పోర్టల్‌లో ఉంచడం దురదృష్టకరం.మేము విశ్వవిద్యాలయ ప్రతిష్టను దెబ్బతీసే నిరాధార వార్తలకు ఎల్లప్పుడూ వ్యతిరేకంగా ఉన్నామని ప్రో-ఛాన్సలర్ చెప్పారు. విచారణ సమయంలో యూనివర్సిటీ బృందం పూర్తి సహకారం ఇచ్చిందని కమిషన్ తన నివేదికలో పేర్కొంది. మా ఛాన్సలర్ డాక్టర్ ఎం.మోహన్‌బాబు మార్గదర్శకత్వంలో యువతకు ప్రపంచస్థాయి సమగ్ర విద్యను అందించడం కొనసాగిస్తామని మంచు విష్ణు పేర్కొన్నారు.