Page Loader
Raja Saab: మారుతీ బర్త్‌డే స్పెషల్‌ 'రాజాసాబ్‌' మేకింగ్‌ వీడియో విడుదల.. చూసి ఎంజాయ్ చేయండి 
మారుతీ బర్త్‌డే స్పెషల్‌ 'రాజాసాబ్‌' మేకింగ్‌ వీడియో విడుదల

Raja Saab: మారుతీ బర్త్‌డే స్పెషల్‌ 'రాజాసాబ్‌' మేకింగ్‌ వీడియో విడుదల.. చూసి ఎంజాయ్ చేయండి 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 08, 2024
05:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

గ్లోబల్ స్టార్ హీరో ప్రభాస్ నటిస్తున్న చిత్రాలలో ఒకటి రాజాసాబ్. హార్రర్ కామెడీ శైలిలో రూపొందుతున్న ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహిస్తున్నాడు. మారుతి బర్త్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ప్రత్యేక గ్లింప్స్ వీడియోను విడుదల చేశారు. తాజా గ్లింప్స్ ప్రకారం, ప్రభాస్ గ్లామరస్ పాత్రలో హార్రర్ కామిక్ టైమింగ్‌తో అదరగొట్టబోతున్నాడు. "కింగ్ సైజ్ ఎంటర్‌టైన్‌మెంట్"పేరిట విడుదల చేసిన మేకింగ్ విజువల్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఈ చిత్రంలో మలయాళ అందాల నటి మాళవిక మోహనన్, ఇస్మార్ట్ భామ నిధి అగర్వాల్ ఫీ మేల్ లీడ్ పాత్రలలో నటిస్తున్నారు. అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్ డే సందర్భంగా సర్‌ప్రైజ్ అనౌన్స్‌మెంట్ ప్రకటించే ఉద్దేశ్యంతో మేకర్స్ ఏదైనా సమాచారం అందిస్తారేమో చూడాలి.

వివరాలు 

కీలక పాత్రలో సంజయ్ దత్

ఇంతకుముందే లాంచ్ చేసిన రాజాసాబ్ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ చిత్రంపై అంచనాలను పెంచేస్తున్నాయి. గ్లింప్స్‌లో, ప్రభాస్ చాలా స్టైలిష్‌గా చేతిలో పూల బొకే పట్టుకొని అద్దంలో తనను తాను చూస్తూ పూలు చల్లుతున్న సీన్లు అభిమానులను ఆనందం కలిగిస్తున్నాయి. ఈ చిత్రంలో సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపిస్తున్నాడు. టీజీ విశ్వప్రసాద్,వివేక్ కూచిబొట్ల సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం 2025 ఏప్రిల్ 10న విడుదల చేయనున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రాజాసాబ్ టీం చేసిన ట్వీట్