
Raviteja75: వచ్చే సంక్రాంతికి రవన్న దావత్ ఇస్తుండు.. రెడీ అయిపోండ్రి
ఈ వార్తాకథనం ఏంటి
మాస్ మహారాజా రవితేజ తన కామిక్ టైమింగ్, మాస్ అప్పీల్, విలక్షణమైన డైలాగ్ డెలివరీకి సుప్రసిద్ధుడు.
సినిమాలు వరుసగా ప్లాప్ అవుతున్నా కూడా వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వస్తున్నాడు.
ఈగల్ సినిమా తరువాత ఇప్పుడు తన 75వ సినిమాను పట్టాలెక్కించబోతున్నాడు.
ఈ రోజు ఉగాది సందర్బంగా ఈ సినిమా గురించి అధికారికంగా ప్రకటించారు మేకర్స్.
కొత్త ప్రయోగాలతో పాటుగా కొత్త డైరెక్టర్ లతో కూడా రవితేజ సినిమాలు చేస్తున్నాడన్నసంగతి తెలిసిందే.
ఇప్పుడు మరో కొత్త డైరెక్టర్ తో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు.
Details
తెలంగాణ నేపథ్యంలో సాగే చిత్రం
మేకర్స్ విడుదల చేసిన పోస్టర్ లో ఊరి జాతర కనిపిస్తోంది.
ఈసినిమా పోస్టర్ లో కళ్ళద్దాల మీద 'RT 75'అని రాసి ఉంటుంది. అలాగే పోస్టర్ మీద "రవన్న దావత్ ఇస్తుండు.. రెడీ అయిపోండ్రి" అని రాసి ఉంది.
అలాగే"హ్యాపీ ఉగాది రా భయ్"అని తెలంగాణ యాసలో రాసి ఉంది.దీనిని బట్టి చూస్తే తెలంగాణ నేపథ్యంలో సాగే చిత్రమని అర్థమవుతోంది.
ఈ సినిమాలో రవితేజ పాత్ర పేరు "లక్ష్మణ భేరి".
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్,ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ,సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
శ్రీకర స్టూడియోస్ ఈచిత్రాన్ని సమర్పిస్తోంది.రచయిత భాను భోగవరపు దర్శకత్వం వహించగా,సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు.
వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు పోస్టర్ లో పేర్కొన్నారు..
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మేకర్స్ చేసిన త్వేర్
I've waited for 11 years for this day and finally it has arrived. There are people who have been supporting me from the beginning and to all of them, 'Thank you'. I'll make you all proud. I'm so excited to start this new journey. pic.twitter.com/tZBj7ox03s
— Bhanu Bogavarapu (@BhanuBogavarapu) April 9, 2024