తదుపరి వార్తా కథనం

Mirai OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న 'మిరాయ్'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
వ్రాసిన వారు
Jayachandra Akuri
Oct 04, 2025
10:49 am
ఈ వార్తాకథనం ఏంటి
తేజ సజ్జా, మంచు మనోజ్ హీరోలుగా కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఫాంటసీ-అడ్వెంచర్ మూవీ 'మిరాయ్' ఇటీవల విడుదలై భారీ బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధించింది. తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి రాబోతున్నది. జియో హాట్‌స్టార్ వేదికగా అక్టోబర్ 10 నుండి స్ట్రీమింగ్ అందుబాటులోకి రానుందని కంపెనీ ప్రకటించింది. ఈ సమాచారాన్ని ప్రకటిస్తూ జియో హాట్‌స్టార్ ఒక పోస్టర్‌ను పంచుకుంది. సినిమాను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషా వెర్షన్లు కూడా అందుబాటులోకి రానున్నాయని హాట్‌స్టార్ తెలిపింది.