LOADING...
OG : పవన్ కళ్యాణ్ 'ఓజీ' కోసం మిరాయ్ నిర్మాత సంచలన నిర్ణయం
పవన్ కళ్యాణ్ 'ఓజీ' కోసం మిరాయ్ నిర్మాత సంచలన నిర్ణయం

OG : పవన్ కళ్యాణ్ 'ఓజీ' కోసం మిరాయ్ నిర్మాత సంచలన నిర్ణయం

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 24, 2025
10:57 am

ఈ వార్తాకథనం ఏంటి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన 'ఓజీ' సినిమా మరికొద్ది గంటల్లో ప్రీమియర్స్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో తేజ సజ్జా హీరోగా నటించిన 'మిరాయ్' సినిమా టీమ్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. మిరాయ్ సినిమా సెప్టెంబర్ 12న విడుదలై, ఇప్పటికీ మంచి జోష్‌తో హౌస్‌ఫుల్స్ కొనసాగుతూ ఉంది. ఇప్పటి పరిస్థితిలో పవర్ స్టార్ 'ఓజి' సినిమా రిలీజ్ అవుతున్నందున, మిరాయ్ సినిమా టీమ్ అన్ని సినిమా థియేటర్ల స్క్రీన్‌లను ఓజి సినిమాకు కేటాయించబోతోంది.

Details

150 కోట్ల దిశగా మిరాయ్

రేపు గురువారం ఓజీ కోసం అన్ని థియేటర్లు ఇవ్వనున్నారు. ఇక శుక్రవారం నుంచి మళ్లీ 'మిరాయ్' సినిమాను యధావిధిగా ప్రదర్శిస్తారు. ఇప్పటికే మిరాయ్ సినిమా రూ.150 కోట్ల వసూళ్ల దిశగా దూసుకుపోతోంది. ఈ నిర్ణయం పవన్ కళ్యాణ్ మీద గౌరవంతో తీసుకున్నట్లు నిర్మాత విశ్వప్రసాద్ పేర్కొన్నారు. సినిమా కోసం ప్రేక్షకులు చూపుతున్న ఆత్రుత, వైబ్ ఇంకా ఉత్సాహభరితంగా కొనసాగుతోంది. అదనంగా సినిమా సాంగ్ కూడా నిన్నే జోడించారు. ఇది ప్రస్తుత ఇండస్ట్రీలో ఒక హెల్తీ కాంపిటీషన్‌ ఉదాహరణ అని చెప్పవచ్చు. పవన్ అభిమానులు మిరాయ్ టీమ్, నిర్మాత విశ్వప్రసాద్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రశంసలు కురిపిస్తున్నారు.