LOADING...
Miss Universe 2025: మిస్ యూనివర్స్‌ పోటీలో భారత్‌కు నిరాశ.. టాప్‌ 12లో వెనుదిరిగిన మణిక విశ్వకర్మ
టాప్‌ 12లో వెనుదిరిగిన మణిక విశ్వకర్మ

Miss Universe 2025: మిస్ యూనివర్స్‌ పోటీలో భారత్‌కు నిరాశ.. టాప్‌ 12లో వెనుదిరిగిన మణిక విశ్వకర్మ

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 21, 2025
10:10 am

ఈ వార్తాకథనం ఏంటి

మిస్ యూనివర్స్ వేదికపై భారత్‌కు ఈసారి నిరాశే మిగిలింది. టాప్‌ 12 ఎంపిక దశలోనే మణిక విశ్వకర్మ పోటీ నుంచి తప్పుకున్నారు. థాయిలాండ్‌లో జరుగుతున్న మిస్ యూనివర్స్ 2025 పోటీల్లో భారత ప్రతినిధిగా రాజస్థాన్‌కు చెందిన మణిక పాల్గొన్నారు. స్విమ్‌సూట్ రౌండ్‌ను విజయవంతంగా పూర్తి చేసి టాప్‌ 30లోకి చేరిన ఆమె... టాప్‌ 12లో మాత్రం దాటలేకపోయారు. దీంతో ఈ ఏడాది మిస్ యూనివర్స్ కిరీటం భారత్‌ దరిచేరలేదు.

వివరాలు 

 న్యూరోనోవా అనే సంస్థను ప్రారంభించిన మణిక

జైపూర్‌లో ఈ ఆగస్టులో నిర్వహించిన మిస్ యూనివర్స్ ఇండియా పోటీల్లో విజేతగా నిలిచిన మణిక విశ్వకర్మకు, మిస్ యూనివర్స్ అంతర్జాతీయ వేదికపై దేశాన్ని ప్రాతినిధ్యం వహించే అవకాశం లభించింది. రాజస్థాన్‌లో జన్మించిన మణిక ప్రస్తుతం న్యూఢిల్లీ నగరంలో నివసిస్తున్నారు. పొలిటికల్ సైన్స్‌లో డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న ఆమె, క్లాసికల్ డ్యాన్స్‌లో నైపుణ్యం సాధించి జాతీయస్థాయిలో అనేక ప్రదర్శనలు అందించారు. చిత్రలేఖనంలో కూడా మంచి పట్టుంది. సమాజ సేవ పట్ల ఆసక్తి ఉన్న మణిక, న్యూరోనోవా అనే సంస్థను ప్రారంభించి న్యూరోలాజికల్ సమస్యలు ఎదుర్కొంటున్న వారికి సేవలు అందిస్తున్నారు.