LOADING...
Srinivasa Mangapuram: 'శ్రీనివాస మంగాపురం'లో వెంకటప్పయ్య నాయుడిగా మోహన్ బాబు.. పవర్‌ఫుల్ లుక్ రివీల్!
'శ్రీనివాస మంగాపురం'లో వెంకటప్పయ్య నాయుడిగా మోహన్ బాబు.. పవర్‌ఫుల్ లుక్ రివీల్!

Srinivasa Mangapuram: 'శ్రీనివాస మంగాపురం'లో వెంకటప్పయ్య నాయుడిగా మోహన్ బాబు.. పవర్‌ఫుల్ లుక్ రివీల్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 28, 2026
01:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

'ఆర్ ఎక్స్ 100', 'మంగళవారం' చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం 'శ్రీనివాస మంగాపురం'. ఈ మూవీలో సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయం అవుతుండగా, బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా థడాని హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రంలో టాలీవుడ్ లెజెండరీ నటుడు మోహన్ బాబు మరోసారి తన రాజసంతో థియేటర్లను దద్దరిల్లించేందుకు సిద్ధమయ్యారు. తాజాగా చిత్ర యూనిట్ ఆయన పోషిస్తున్న పవర్‌ఫుల్ పాత్రను అధికారికంగా పరిచయం చేసింది. మోహన్ బాబు 'వెంకటప్పయ్య నాయుడు' (Venkatappaya Naidu) అనే పాత్రలో కనిపించనున్నారు.

Details

సంగీతాన్ని సమకూర్చనున్న జి.వి ప్రకాష్ కుమార్

వైజయంతి మూవీస్ విడుదల చేసిన పోస్టర్‌ను పరిశీలిస్తే, ఆయన పాత్ర బలమైన వ్యక్తిత్వంతో, ప్రభావవంతంగా ఉండబోతుందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. మోహన్ బాబు ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీకి అజయ్ భూపతి రూపొందించిన ఇంటెన్స్ క్యారెక్టరైజేషన్ తోడైతే బాక్సాఫీస్ వద్ద భారీ స్పందన రావడం ఖాయమనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీ దత్, జెమిని కిరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ జి. వి. ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

Advertisement